ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన యాపిల్ సంస్థ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్స్‌కి యాపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో ‘యాపిల్’ సంస్థ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి 20 ఏళ్లకు పైగా అవుతోంది. అయితే ఈ సంస్థ ఆపరేషన్స్ ఇప్పటి వరకూ ఇండియాలో నేరుగా అయితే కొనసాగించలేదు. కానీ మొట్ట మొదటి సారి ‘యాపిల్’ సంస్థ దాని అమ్మకాలను నేరుగా ఇండియాలో కొనసాగిస్తోంది. ఈ మేరకు యాపిల్ సంస్థ ఇండియాలో ఆన్లైన్ స్టోర్‌ను లాంచ్ చేసింది. ఇది దాదాపుగా మొత్తం ఉత్పత్తులను అందించడంతో పాటు, దేశంలోని వినియోగదారులకు మొదటిసారిగా అనేక రకాల సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ తన 38వ ఆన్లైన్ స్టోర్‌ను భారత్ ప్రారంభించింది.
భారతదేశంలోని వినియోగదారులు ఇప్పుడు యాపిల్‌కేర్ + ను కొనుగోలు చేయవచ్చు.. అలాగే ఇది దాని ఉత్పత్తులపై వారంటీని సైతం విస్తరించనుంది. కొత్త హార్డ్‌వేర్ కొనుగోళ్లపై తగ్గింపు పొందడానికి ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయవచ్చు. చాట్ లేదా టెలిఫోన్ ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తామని సంస్థ తెలిపింది. అలాగే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ముందు వినియోగదారులు తమ నిపుణుల బృందాన్ని సంప్రదించమని కంపెనీ వెల్లడించింది. అలాగే సంస్థ వినియోగదాలకు ఈఎంఐ అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. సెప్టెంబర్ మూడో వారంలో తమ ఆన్లైన్ స్టోర్‌ను ఇండియాలో ప్రారంభించాలని యోచిస్తున్నట్టు టెక్ క్రంచ్ జనవరిలో వెల్లడించింది.
అలాగే వచ్చే ఏడాది నాటికి ఇండియాలో తొలి ఫిజికల్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ కన్వర్జెన్స్ కాటలిస్ట్‌లో చీఫ్ అనలిస్ట్ అయిన జయంత్ కొల్లా మాట్లాడుతూ.. భారతదేశంలో అందుబాటులో ఉండే ఐఫోన్లు, ఇతర ఉత్పత్తుల బిల్‌బోర్డ్‌లు, యాడ్స్‌ను ఆపిల్ సంస్థ పర్యవేక్షిస్తుందని.. అయితే దీనిని థర్డ్ పార్టీ పార్ట్నర్స్ నడుపుతారని తెలిపారు. "ఆపిల్ కొన్ని మార్కెటింగ్ డాలర్లను అందించవచ్చు, కానీ దీనిని భాగస్వాములే నడిపిస్తారు" అని జయంత్ కొల్లా వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments