అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ట్రైల‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Tuesday,December 06 2016]

నారా రోహిత్ - ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేం శ్రీవిష్ణు హీరోలుగా న‌టిస్తున్న చిత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. ఈ చిత్రాన్ని అయ్యారే ఫేమ్ సాగ‌ర్ చంద్ర తెర‌కెక్కిస్తున్నారు. రోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర‌న్ వ‌ర్క్స్ మీడియా బ్యాన‌ర్ పై ప్ర‌శాంతి, కృష్ణ విజ‌య్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు. 1990లో హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ప్రాంతంలో జ‌రిగిన యధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

శ్రీవిష్ణు క్రికెట‌ర్ గా, ఆత‌ర్వాత అడ‌విలో అన్న‌ల గ్యాంగ్ లో ఒక‌డుగా క‌నిపించాడు. ఇక నారా రోహిత్ పోలీస్ గా క‌నిపించాడు. అలాగే అడ‌విలో అన్న‌ల గెట‌ప్ లో కూడా క‌నిపించడం విశేషం. నిన్ను నీ అక్క‌ను, నీ బావ‌ను వాడి మెంట‌ల్ సైన్యం మొత్తాన్నీ నాశ‌నం చేస్తా అంటూ నారా రోహిత్ చెప్పే డైలాగ్, ఏ బాత్ లిక్ లేనా భాయ్ కుదాఫిస్ అంటూ శ్రీవిష్ణు డైలాగ్ తో హీరోలిద్ద‌రి క్యారెక్ట‌ర్స్ ఎలా ఉంటాయో చెప్పారు. ఇంట్ర‌స్ట్ గా, డిఫ‌రెంట్ గా ఉన్న‌ ఈ ట్రైల‌ర్ చూస్తుంటే ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది అనిపిస్తుంది. మ‌రి...అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి..!

More News

అమ్మకు తెలుగంటే మహా ఇష్టం - 'మా' అధ్యక్షులు డా.రాజేంద్ర ప్రసాద్

అమ్మ జయలలిత తమిళులకే కాదు..తెలుగువారికి ఆత్మీయురాలు..

డిసెంబర్ 16న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' చిత్రాన్ని విడుదల చేస్తున్న దిల్ రాజు

తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి సినిమా వస్తుందన్నా, ఆయన ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నాతప్పకుండా సినిమా ఆడియెన్స్ను అలరించే సినిమా అవుతుందనే నమ్మకం అందరి మదిలో ఉంది.

అమ్మ‌కు జ‌న‌సేన నీరాజ‌నం

విప్ల‌వ నాయ‌కి, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అయిన ప్రియ‌త‌మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం న‌న్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్ లో చేరిన ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో తిరిగి ఇంటికి చేరుకుంటార‌ని దేశ ప్ర‌జ‌ల‌తో పాటు నేను ఆశించాను అని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.

మహిళా శక్తికి నిదర్శనం - డా.మోహన్ బాబు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారి ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం.

జయలలిత గారి మరణం తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి మరణవార్త నన్నెంతో కలిచి వేసింది.