ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న అప్పట్లో ఒకడుండేవాడు టీజర్..!
Friday, October 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్ - ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం శ్రీవిష్ణు హీరోలుగా నటిస్తున్న చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రాన్ని అయ్యారే ఫేమ్ సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. రోహిత్ సమర్పణలో ఆరన్ వర్క్స్ మీడియా బ్యానర్ పై ప్రశాంతి, కృష్ణ విజయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో శ్రీవిష్ణు క్రికెటర్ గా, ఆతర్వాత అడవిలో అన్నల గ్యాంగ్ లో ఒకడుగా కనిపించాడు.
ఇక నారా రోహిత్ పోలీస్ గా కనిపించాడు. అలాగే అడవిలో అన్నల గెటప్ లో కూడా కనిపించడం విశేషం. 1990లో జరిగిన సంఘటనల స్పూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. మొసలికి నీటిలో బలం, వీళ్లకు అడవిలో బలం అనే డైలాగ్, ఇంట్రస్టింగ్ అనిపిస్తున్న నారా రోహిత్ & శ్రీవిష్ణు గెటప్స్ అలాగే విజువల్స్ ఇదంతా చూస్తుంటే...ఈ సినిమాలో రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఏదో ఉంది అనిపిస్తుంది. తొలి ప్రయత్నంగా అయ్యారే అనే వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన సాగర్ చంద్ర ఈ మూవీతో విజయం సాధిస్తాడు అనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments