మణిరత్నంకి గుండెపోటు వార్తలపై అపోలో వైద్యుల స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
నాయకుడు, గీతాంజలి, దళపతి, రోజా, ముంబై, సఖి, ఓకే బంగారం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఇప్పుడు నవాబ్స్(తమిళంలో చెక్క చివంద వానం) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు వచ్చిందని. ఆయన్ని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వినిపించాయి. అయితే అపోలో వైద్యుల దీనిపై సమాధానమిస్తూ.. మణిరత్నం రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. గతంలో రావణ్ సినిమా సమయంలో కూడా మణిరత్నంకి గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా ఆయనకు వెంటనే వైద్యం అందడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments