ఏప్రిల్ 1 వస్తున్న రాజాధిరాజా.
Wednesday, March 30, 2016 తెలుగు Comments
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
Listen to article
--:-- / --:--
1x
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో శర్వానంద్. ఈ హ్యాట్రిక్ హీరో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ దర్శకత్వంలో ఎన్.వెంకటేష్ నిర్మించిన చిత్రం రాజాధిరాజా.
లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన రాజాధిరాజా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శర్వానంద్, నిత్యామీనన్ ల జోడి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ చిత్రంలో లవ్, ఎమోషన్స్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకునేలా డైరెక్టర్ చేరన్ తెరకెక్కించారు. తెలుగులో విజయవంతమైన నా ఆటోగ్రాఫ్ తమిళ మాతృకను తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ నాలుగు నేషనల్ అవార్డ్స్ ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. మరి...నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ డైరెక్టర్ చేరన్ రాజాధిరాజా తో తెలుగులో సక్సెస్ సాధిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.