ఏప్రిల్ 1 వస్తున్న రాజాధిరాజా.

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో శ‌ర్వానంద్. ఈ హ్యాట్రిక్ హీరో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ దర్శకత్వంలో ఎన్.వెంకటేష్ నిర్మించిన‌ చిత్రం రాజాధిరాజా.
లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన రాజాధిరాజా ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శర్వానంద్, నిత్యామీనన్ ల జోడి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ చిత్రంలో లవ్, ఎమోషన్స్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకునేలా డైరెక్ట‌ర్ చేర‌న్ తెర‌కెక్కించారు. తెలుగులో విజయవంతమైన నా ఆటోగ్రాఫ్ తమిళ మాతృకను తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ నాలుగు నేష‌న‌ల్ అవార్డ్స్ ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. మ‌రి...నేష‌న‌ల్ అవార్డ్స్ విన్నింగ్ డైరెక్ట‌ర్ చేర‌న్ రాజాధిరాజా తో తెలుగులో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

నాడు వెంకటేష్-నేడు నారా రోహిత్..

వెంకటేష్..ఎన్నో విజయాలు సాధించిన సీనియర్ హీరో.రోహిత్...ఇప్పుడిప్పుడే డిఫరెంట్ మూవీస్ చేస్తున్న యువ హీరో.

సెకండ్ టైమ్ ట్రై చేస్తోన్న సమంత

నటిగా ఆరేళ్ల ప్రయాణంలో..దాదాపు 30 సినిమాలతో సందడి చేసింది చెన్నైపొన్ను సమంత.

బాలయ్య వందో సినిమాలో రాజమాత ఎవరు..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమాని ఉగాది రోజున ప్రకటించనున్న విషయం తెలిసిందే.

అప్పుడు మిస్‌..ఇప్పుడు ఎస్‌..

రెండు ప్ర‌ముఖ కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌రు క‌థానాయ‌కులు.. గ‌త నెల మొద‌టివారంలో పోటీకి సిద్ధ‌మ‌య్యారు. అయితే.. అనివార్య కార‌ణాల వ‌ల్ల చివ‌రి నిమిషంలో ఒక‌రి సినిమా మ‌రో వారం రోజుల పాటు వాయిదా ప‌డింది.

నితిన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది..

యువ హీరో నితిన్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా  అ ఆ సినిమా ప్ర‌చార చిత్రాల‌ను రిలీజ్ చేసారు. ఇదిలా ఉంటే నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యువ హీరోలు - స‌న్నిహితులు నితిన్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు.