close
Choose your channels

అపార్ట్ మెంట్ పాటలు విడుదల

Tuesday, August 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ క్రియేటివ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో, నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ నిర్మించిన సస్పెన్స్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'అపార్ట్‌మెంట్‌'. సంగీత దర్శకుడు ఖుద్దూస్‌ ఎస్‌.ఎ. సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోని ప్రముఖ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మరియు దర్శకుడైన ఆర్పీ పట్నాయక్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ.. 'పాటలు విన్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఖుద్ధూస్‌ గురించి నాకు బాగా తెలుసు. బాగా కష్టపడతాడు. ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్‌ వస్తుందని ఆశిస్తున్నాను..' అని అన్నారు.

దర్శకుడు శివగంగరాజు వుడిమూడి మాట్లాడుతూ.. 'ఒక అపార్ట్‌మెంట్‌ కల్చర్‌లోకి ఎంటరైన ఒక అమ్మాయి..అక్కడ ఎలాంటి అనుభవాలను ఫేస్‌ చేసింది అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఇది నా మొదటి సినిమా. నిర్మాతకు ఋణపడి ఉంటాను. అలాగే సంగీత దర్శకుడు మంచి పాటలతో పాటు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఇచ్చాడు..తప్పకుండా ఈ చిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను..అన్నారు.

నిర్మాత ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ మాట్లాడుతూ.. 'దర్శకుడు తొలి చిత్రమే అయినా..చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, టెక్నీషీయన్స్‌కి నా కృతజ్ఞతలు. ఖుద్ధూస్‌ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. సినిమా బాగా వచ్చింది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది..అని అన్నారు.

సంగీత దర్శకుడు ఖుద్దూస్‌ మాట్లాడుతూ.. 'ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకి నా ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా నాకు మంచి బ్రేక్‌ వస్తుందని ఆశిస్తున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment