పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న'అపార్ట్‌మెంట్'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ క్రియేటివ్ ఫిలిమ్స్ పతాకంపై నిఖిత ప్రధానపాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ నిర్మించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ చిత్రం 'అపార్ట్‌మెంట్'. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ చిత్ర విశేషాలను తెలియజేస్తూ..'ఇదొక సస్పెన్స్‌తో కూడుకున్న మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. నిఖిత పాత్ర ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటుంది. అలాగే మిగతా ప్రధాన పాత్రల్లో సంజన, ఉత్తేజ్, చిన్నా వంటి వారు ఈ మూవీలో అద్భుతంగా నటించారు. అలాగే మా సంగీత దర్శకులు ఖుద్దూస్ ఎస్.ఎ. స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రిథమ్ స్టూడియోలో ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్‌లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నాము. ఆగస్ట్ చివరి వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని తెలిపారు.
నిఖిత, సంజన, చిన్నా, ఉత్తేజ్, విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్ ఎస్.ఎ., కెమెరా: సాబూ జేమ్స్, ఎడిటర్: నాగిరెడ్డి, ప్రొడ్యూసర్: ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ, కథ-దర్శకత్వం: శివగంగరాజు వుడిమూడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com