ఫలితాలకు ముందే ఏపీ యంగ్ మంత్రి రాజీనామా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామా చేయనున్నారు. కాగా.. మావోయిస్టుల కాల్పుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కిడారి కుమారుడు శ్రావణ్‌కు ఎలాంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారమంతా గత ఏడాది నవంబర్ 11న జరిగింది. కాగా.. మంత్రి పదవి స్వీకరించినట్లయితే ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. అయితే ప్రమాణం మొదలుకుని ఇప్పటి వరకూ శ్రవణ్ చట్ట సభ్యుడు కాలేదు. దీంతో రాజీనామా చేయక తప్పలేదు.
కాగా.. మే-10తో శ్రావణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కాబోతోంది. అయితే ఇంత వరకు చట్టసభల్లో సభ్యుడు కాకపోవడంతో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అయితే కుమారుడికి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసిన చంద్రబాబు.. కిడారిని మాత్రం ఎమ్మెల్సీగా చేయలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి చూస్తే ఏపీ యంగ్ మంత్రి ఎన్నికల ఫలితాలు రాకముందే రాజీనామా చేయక తప్పదన్న మాట. ఇదిలా ఉంటే ఈ తండ్రి పోటీచేసిన అదే నియోజకవర్గం నుంచే టీడీపీ తరఫున కిడారి శ్రావణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే మంత్రి పదవి అయితే ఎలాగో పోతోంది.. ఇక ఎమ్మెల్యే అయినా అవుతారో లేకుంటే అది కూడా ఉష్.. అంటుందో తెలియాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout