మార్చి1 నుండి తెలంగాణ, ఏపీ లోని థియేటర్ల మూసివేత

  • IndiaGlitz, [Thursday,February 01 2018]

తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి అధ్య‌క్షులు పి. కిర‌ణ్, సెక్ర‌ట‌రీలు ఎమ్ . రామ‌దాసు, కె. శివ‌ప్ర‌సాద‌రావు, తెలంగాణ రాష్ర్ట ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు కె. ముర‌ళీ మోహ‌న్, సెక్ర‌టరీ సునీల్ నారంగ్ , ద‌క్షిణాది ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు ఎల్. సురేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ శ్రీ రవి కొట్ట‌రాక‌ర‌, త‌మిళ సినిమా నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ కృష్ణ‌, సెక్ర‌ట‌రీ కతీర్ సేన్, క‌ర్ణాట‌క ఫిలిం ఛాంబ‌ర్ సెక్ర‌ట‌రీ ఎన్.ఎమ్ సురేష్‌, కెర‌ళ ఫిలిఛాంబ‌ర్ అధ్య‌క్షులు కె. విజ‌య్ కుమార్, కేర‌ళ ఫిలిం డిస్ర్ట్యిబ్యూష‌న్ సంఘం అధ్య‌క్షులు సియ్యాద్ కొక్కెర‌, కేర‌ళ ఫిలిం నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షులు జి. సురేష్ కుమార్ , నిర్మాత‌లు, పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్లు త‌దిత‌రులు క‌లిసి డిజిట‌ల్ స‌ర్వీసె ప్రొవైడ‌ర్స్ తీసుకుంటోన్న ఏకప‌క్ష నిర్ణ‌యాల గురించి చ‌ర్చించుట‌కు తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి కార్యాల‌యంలో 31-01-2018 నాడు అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైంది.

ఈ స‌మావేశంలో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారు వ‌సూలు చేయుచున్న ఛార్జీల గురించి మ‌న సినిమా ప్ర‌తిఫ‌లం మ‌నం అందుకోకుండా ఎక్క‌డినుంచో వ‌చ్చిన‌ డిజిట‌ల్ ప్రొవైడ‌ర్స్ అన్యాయంగా దోచుకుంటున్నార‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీలా త‌యారై అధికంగా డ‌బ్బు గుంజుతున్నారని అంద‌రూ ఆరోపించారు. త‌క్కువ ధ‌రకు వ‌స్తున్న‌ డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారిని రాకుండా ఆపేస్తున్నార‌ని స‌భ్యుల‌ద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారితో ఒక వారంలోగా స‌మావేశం ఏర్పాటు చేసి ధ‌ర‌ల త‌గ్గింపు ఇత‌ర‌త్ర విష‌యాల‌పై చ‌ర్చించేందుకు నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఈ స‌మావేశంలో స‌భ్యులంద‌రూ ముక్త‌కంఠంతో ఒక వారం రోజులు లోపుగా ఈస‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌ని యెడ‌ల మార్చి 1, 2019 వ‌తేదీ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ర్టాల‌లోని థియేట‌ర్ల‌ను మూసివేయుట‌కు నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది.

More News

పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లొ 'ఒక్కటే లైఫ్'

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం 'ఒకటే లైఫ్' .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా  నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తక్కువ గ్యాప్ లో వస్తున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..తెలుగు పరిశ్రమకు వచ్చి పదేళ్ళు పూర్తయ్యింది.

నిత్యా.. రెండు చాలెంజింగ్ రోల్స్

అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే సందడి చేసే కథానాయికల్లో కేరళ కుట్టి నిత్యా మీనన్ ముందుంటుంది.

నాని హీరోయిన్ , డైరెక్టర్ కి కలిసొచ్చింది

వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు యువ కథానాయకుడు నాని.

భాగమతితో కొనసాగింది

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా రాణిస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ.