AP Students:ఐరాసలో ఏపీ విద్యార్ధులు.. ఆ ప్రసంగానికి దేశాధినేతలే ఫిదా, మన సర్కారీ బడులపై మేధావుల ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
పేదవాడి తలరాతను మార్చేది విద్యేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ తరచుగా చెబుతూ వుంటారు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించారు. సరైన వసతులు లేక శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలకు ‘‘నాడు నేడు’’ ద్వారా కొత్త రూపు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లు కార్పోరేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా అంతకుమించి అనేలా వున్నాయి. నిష్ణాతులైన టీచర్లతో పాఠాలు భోదించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం రాకతో పిల్లలు ప్రతిభావంతులుగా మారుతున్నారు. దీనికి తోడు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ధ, అమ్మఒడి వంటి పథకాలతో పిల్లలు చదువుకునేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు జగన్.
ఏపీ విద్యా విధానంపై జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు:
ఏపీలో విద్యా రంగం అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, మేధావులు, అధికారులు మెచ్చుకుంటున్నారు. పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి పరిస్ధితిని అధ్యయనం చేస్తున్నాయి. సరైన ప్రోత్సాహం, వసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను ఆపడం ఎవరి తరం కాదని కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు, కొండ కోనల నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు పెద్ద పెద్ద ప్రొఫెసర్ల ముందే ఎలాంటి బెరుకు లేకుండా అనర్గళంగా ప్రసంగిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి సదస్సు:
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర -అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరై స్టాల్ పెట్టి జగన్ సర్కార్ చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దీనిని సావధానంగా విన్న వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మన పిల్లల ప్రతిభకు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిదా :
అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు. అలాగే విద్యారంగంలో బాలికలు సాధించిన . ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం.. దాన్ని అమలు చేస్తున్న తీరు, పిల్లలు ఆ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత ప్రమాణాలను ఆకళింపు చేసుకుంటున్న తీరు అభినందనీయమని కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ అన్నారు. మన విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో విద్యా విధానంలో వచ్చిన మార్పులపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
జగన్ శ్రమకు ప్రతిఫలం :
సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరగనున్న ఈ ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లారు. సమాజ మనుగడకు యువత.. యువ శక్తే కీలకం. అంటూ మన రాష్ట్ర విద్యార్థులు చేసిన ప్రసంగాలు దేశాధినేతలు, మంత్రులు, అధికారులను మంత్రముగ్ధుల్ని చేసింది. సాధారణ ప్రభుత్వ స్కూళ్ల పిల్లల్లో ఇంత పరిణితి రావడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం అని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తూ.. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments