అయ్యా.. ఏపీ ఆటల మంత్రీ.. ఆ మాత్రం తెలియదా!?

  • IndiaGlitz, [Thursday,August 29 2019]

నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఫ్లెక్సీలో సానియా మీర్జా ఫోటో ప్రింట్ చేసి.. కింద పీటీ ఉష పేరు రాయడం జరిగింది. అలాగే ప్రోత్సహకాలను ఇంగ్లీష్‌లో టైటిల్ పెట్టడంపై ట్రోల్ చేస్తున్నారు. సానియా మీర్జాకు, పీటీ ఉషకు తేడా తెలియదా..? అంటూ నెటిజన్లు, ప్రతిపక్షానికి చెందిన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఈ ఫ్లెక్సీ జాతీయ క్రీడా ఏర్పాట్లలో విశాఖ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. బీచ్ రోడ్డులో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తప్పిదాలు అధికారులను నవ్వుల పాలు చేశాయి. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ఫ్లెక్సీలను చూసి కంగుతిన్నారు.

ఆ మాత్రం తెలియకుంటే ఎలా..!?
అయితే ఇది మంత్రి గారు చూసి కూడా మిన్నకుండిపోవడం గమనార్హం. అంటే ఆయనకు కూడా సానియా ఎవరో... ఉష ఎవరో తెలియదా..? లేకపోతే తెలిసి కూడా లైట్ తీసుకున్నారా అన్నది పైనున్న పెరుమాళ్లకే ఎరుక. పేరుకేమో ఆటల మంత్రి.. ఆ మాత్రం తెలియదా అంటూ ఇటు ప్రతిపక్షాలు.. అటు నెటిజన్లు ఓ రేంజ్‌లో ఈ ఫ్లెక్సీని, మంత్రిని ట్రోల్ చేస్తున్నారు.

సింధులాంటి ఆణి ముత్యాలకు..!
దీన్ని భూతద్ధం పట్టి చూసిన మాజీ మంత్రి నారా లోకేష్.. ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ‘చంద్రబాబుగారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్ కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోంది. అది చంద్రబాబుగారి దార్శనికత’అంటూ క్రీడాకారులకు టీడీపీ హయాంలో ప్రోత్సహం అందించామన్నారు.

సానియా ఎవరో ఉష ఎవరో తెలియదా..!?
‘ఇక ఇప్పటి వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి తమ పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోంది. సానియా మీర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలీని దురవస్థలో క్రీడాశాఖ మంత్రి ఉన్నారు’అంటూ మరో ట్వీట్‌లో లోకేష్ విమర్శలు గుప్పించారు.

అయితే.. ఇలాంటి ఫ్లెక్సీ వ్యవహారాలు వైసీపీకి పరిపాటిగా వస్తున్నాయి. మొన్నటికి మొన్న నెల్లూరులో ఇస్రో ఓ భారీ ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయితే దానికి ‘నాసా’ సక్సెస్ అయ్యిందని చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా ఇలా ఏకంగా ఆటల మంత్రి పేరిటే ఫ్లెక్సీలు వెలిశాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

More News

‘మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్ లుక్ రిలీజ్

దర్శకులు హీరోలు కావడం కామన్ గానే చూస్తున్నాం. కానీ తన దర్శకత్వంతోఫేమ్ అయిన హీరో నిర్మించిన సినిమాలో అదే దర్శకుడు హీరోగా

తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం!

పాలమూరు ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు.

‘సాహో’ కోసం సుజిత్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే...!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు పలువురు పాత్రలు

పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్

పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అస్తమానూ దాయాదీ దేశమైన పాక్ కాలుదువ్వడం..

రేపు రాజధానిలో జనసేనాని పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యంపై భూములిచ్చిన రైతులు, ఆ ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన, వారి బాధలను తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీన