‘బీకాంలో ఫిజిక్స్ కాదు.. డిగ్రీలో హెచ్ఈసీ’ చదివిన ఏపీ స్పీకర్!
Send us your feedback to audioarticles@vaarta.com
బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను బహుశా ఎవరూ మరిపోరు.. రానున్న రోజుల్లో కూడా మరిచిపోరు గాక మరిచిపోరు. అందుకు కారణమేంటో అందరికీ తెలిసిందే. అలా ఒక్క ఇంటర్వ్యూతో ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో మార్మోగింది. అదీ జలీల్‌ఖాన్ రేంజ్. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఈయన టీడీపీ తీర్థం పుచ్చుకుని.. ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె ‘సైకిల్’ గుర్తుపై పోటీ చేయించగా.. ఘోరంగా ఓడిపోయారు. అయితే బీకాంలో ఫిజిక్స్ లాగే ఇప్పుడు డిగ్రీలో డిగ్రీలో హెచ్ఈసీ చదివానంటూ ఓ కీలకనేత తప్పులో కాలేశారు. ఆ కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాడు ఫిజిక్స్.. నేడు హెచ్ఈసీ!
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఆముదాల వలస నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. ఆయన సీనియార్టి, సిన్సియార్టీ, వాక్ చాతుర్యాన్ని గుర్తించిన వైఎస్ జగన్.. సీతారంకు శాసన సభ స్పీకర్ పదవి కట్టెబ్టారు. ఈ ఎంపికతో అటు పార్టీ నేతలు, కార్యకర్తలు, వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం పలు చానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. కాగా గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌లో.. బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యేనే బుక్ చేసిన ఇంటర్వూయర్‌కే తమ్మినేని కూడా అడ్డంగా బుక్కయ్యారు.
ఇంతకీ అసలేం జరిగింది..
తమ్మినేని సీతారాంకు.. ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే అన్నింటినీ సమాధానాలు సరిగ్గానే సీతారాం ఈ ఒక్క ప్రశ్న దగ్గర మాత్రం ఆయన చెప్పిన సమాధానానికి నెట్టింట్లో ట్రోలింగ్ అవుతున్నారు.
ప్రశ్న:- మీరు (తమ్మినేని సీతారాం) ఎంతవరకు చదువుకున్నారు సార్..!?
సీతారామ్ : కొంత మంది టీడీపీ నేతల లాగా నేను బీకాంలో ఫిజిక్స్ చదువుకోలేదు (జలీల్ ఖాన్‌ను ఉద్దేశించి).. నేను ఇంటర్మీడియట్‌లో సిఈసి చదివి ఆ తర్వాత డిగ్రీలో హెచ్ఈసీ చదివాను" అని చెప్పుకొచ్చారు. డిగ్రీలో హెచ్ఈసీ ఎక్కడా ఉండదు.. ఉండబోదు కూడా. అయితే తమ్మినేని మాత్రం నిజంగానే హెచ్ఈసీ చదివారో లేకుంటే టంగ్ స్లిప్పై చెప్పారో కానీ నెటిజన్లు మాత్రం నవ్వు ఆపుకోలేక పోతున్నారు.
ప్రస్తుతం.. ఆయన అసెంబ్లీ స్పీకర్ కావడంతో అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా గట్టిగా టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తమ్మినేనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఈయన చేసిన వాగ్ధానాలను కూడా జనాలు గుర్తుతెచ్చుకుని మరీ టీడీపీ కార్యకర్తలు, నెటిజన్లు నవ్వు కుంటున్నారు. సో.. ఈ వ్యవహారంపై తమ్మినేని, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout