జనసేనకు ఆ అధికారం లేదు.. ఎస్‌ఈసీ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎస్‌ఈసీ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో తొలుత ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఆ తరువాత మునిసిపల్ చైర్మన్‌ల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో హోదాలు ఓటు హక్కు ఉండనుంది. గుర్తింపు కలిగిన పార్టీలకు విప్ జారీ చేసే అధికారాన్ని కూడా ఎస్‌ఈసీ కల్పించింది. అయితే జనసేన పార్టీకి మాత్రం ఆ అవకాశం లేదంటూ ఎస్‌ఈసీ షాక్ ఇచ్చింది.
ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మొత్తం 18 రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే అధికారాన్ని పొందాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయంగా ఓ లేఖ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ 18 రాజకీయ పార్టీల్లో జనసేన లేకపోవడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. ఒక పార్టీ విప్ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉండాలంటే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద కూడా గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా నమోదై ఉండాలి. అలాంటి పార్టీలకు మాత్రమే విప్ జారీ చేసే అధికారం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ అయితే కాదని తేల్చి చెప్పింది.
కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక గుర్తు రిజర్వుడు చేయబడిన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమేనని కాబట్టి ఆ పార్టీకి విప్ జారీ చేసే అధికారం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ కారణంగానే విప్ జారీ చేసే అధికారమున్న పార్టీల జాబితాలో జనసేనను చేర్చలేదని ఎస్‌ఈసీ వెల్లడించింది. ప్రస్తుతం జనసేనకు రాపాక వరప్రసాద్ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యే జనసేన మద్దతు ఇస్తున్న అభ్యర్థికి ఓటు వేస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే.. ఎప్పటి నుంచో ఆయన జనసేనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడు అధినేతను తూలనాడుతూ.. వైసీపీని మాత్రం ఆకాశానికెత్తుతున్నారు. ఇప్పుడు విప్ జారీ చేసే అధికారం జనసేనకు లేకపోవడంతో ఇక రాపాకను అడ్డుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com