నోటికి పనిచెప్పిన కొడాలి నాని.. షాకిచ్చిన ఎస్‌ఈసీ
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి కొడాలి నాని మరోసారి నోటికి పని చెప్పారు. ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన ఛానెళ్లు, పత్రికలను తాము నమ్ముకోలేదని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. సీఎం జగన్ చిటికెన వేలిని కూడా ఏం చేయలేరన్నారు. ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకోవాలన్నారు. జగన్నాథ రథ చక్రాల కింద పడి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నలిగిపోతారని కొడాలి నాని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కొడాలి నాని మాట్లాడుతూ.. తనకు అనుకూలంగా ఉండే మీడియాలో ఫేక్ వార్తలు రాయిస్తూ రాక్షసానందం పొదుతున్నారని ఆరోపించారు. అలాగే ఎన్నికల సమయంలో ఓట్లను లాక్కోవడానికి ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని నాని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో కలిసి చంద్రబాబు చేస్తున్న కుట్రలు సీఎం జగన్ ముందు పనిచేయవన్నారు.
కాగా... మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో.. దురుద్దేశాలు ఆపాదించడంపై ఎస్‌ఈసీ సీరియస్ అయ్యింది.
మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ పరిశీలించింది. పూర్తి వివరణ ఇవ్వాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటలలోపు కొడాలి నాని వ్యక్తిగతంగా లేదా.. ప్రతినిధి ద్వారా వివరణ పంపాలని ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ తెలిపారు. వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout