ఏపీ సీఎం ఎవరో ఈ సర్వేతో తేలిపోయింది..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరనున్నాయి. అయితే దేశం మొత్తమీద ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఏపీకి ఎవరు సీఎం అవుతారని తేల్చడానికి సర్వే సంస్థలు నానా తంటాలు పడుతుంటాయి. ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించి వైసీపీకే పట్టం కట్టాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థల సర్వేలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సర్వేలన్నీ అక్షరాలా నిజమై తెలంగాణలో కారు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జాతీయ సర్వేలపై జనాల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. వైసీపీనే గెలుస్తుందని మరోసారి జాతీయ మీడయా చెబుతుండటంతో ఇది కూడా అక్షర సత్యమవుతుందని ప్రతిపక్ష పార్టీ నేతలు నమ్ముతున్నారు.
సర్వేలో ఏం తేలింది..?
అయితే తాజాగా.. ఓ జాతీయ దినపత్రిక ఏపీలో ఎన్నికల పరిస్థితిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో టీడీపీనే మళ్లీ గెలుస్తుందని తేలింది. టీడీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది..? అని ఏపీలోని పలు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించగా.. సంతృప్తికరంగానే ఉందని 52.7 శాతం మంది ప్రజలు స్పష్టం చేసినట్లు తేలింది. మరోవైపు.. టీడీపీ పాలనపై 47.3 శాతం మంది ప్రజలు సానకూలంగా ఉన్నారని తేలింది. ముఖ్యంగా.. అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి పెంపు, ఫించను పెంపు అంశాలు టీడీపీపై సానుకూలతను పెంచాయని ఈ సర్వేలో స్పష్టమైంది. సో ఈ సర్వే మొత్తమ్మీద మళ్లీ ఏపీలో టీడీపీ అధికారం దక్కించుకోబోతోందని తేలిపోయిందన్న మాట. మార్చి 2 నుంచి 8వ తేదీలోపు తమ సిబ్బంది ఏపీలో సర్వే చేసిందని సదరు మీడియా సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
వైసీపీ, జనసేన పరిస్థితిపై..!?
ఇదిలా ఉంటే.. ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందనేది ఆ పత్రిక బహిర్గతం చేయలేదు. ఒక వేళ ఏపీలో హంగ్ ఏర్పడితే మాత్రం జనసేన కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలో సదరు జాతీయ పత్రిక తెలిపింది. సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ సర్వే పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఏపీలో ఇప్పటి వరకూ జాతీయ మీడియా సంస్థలు జరిపిన ఎన్నికల సర్వేలో వైసీపీదే అధికారమని తేల్చిచెప్పగా.. ఫస్ట్ టైమ్ ఓ జాతీయపత్రిక టీడీపీదే అధికారమని తేల్చడం గమనార్హం. అయితే ఈ సర్వేను జనాలు ఏ మాత్రం నమ్ముతారు..? ఏ పార్టీని ఆదరిస్తారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout