ఎన్నాళ్లో వేచిన ఉదయం: మంత్రిగా ప్రమాణం చేసిన రోజా.. ఇక సినిమాలు, జబర్దస్త్‌కు గుడ్‌బై
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి పదవి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన సీనియర్ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కలలు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్దీకరణ నేపథ్యంలో ఆమెకు అవకాశం కల్పించారు సీఎం జగన్. తొలుత మంత్రివర్గ కసరత్తులో సామాజిక సమీకరణలు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో వుండటంతో రోజాకు మరోసారి మొండి చేయి తప్పదని ప్రచారం జరిగింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రోజా.. ఆదివారం పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవి ఆమెను వరించింది. దీంతో రోజా, ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నగరి, హైదరాబాద్‌లలోని రోజా నివాసాల వద్ద అభిమానులు, మద్ధతుదారులు భారీ స్థాయిలో సంబరాలు జరుపుకున్నారు.
ఇకపోతే.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇవాళ ఉదయం 11.31 నిమిషాలకు అమరావతిలోని సచివాలయం పక్కనున్న ఖాళీ స్థలంలో జరిగింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 25 మంది చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రోజా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిని అయ్యాననే ఆనందం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించింది. అనంతరం సీఎం జగన్ కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
మరోవైపు.. ఏపీ మంత్రిగా అవకాశం దక్కడంతో ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టీవీ, సినిమాలలో నటించనని అలాగే.. కామెడీ షో జబర్దస్త్‌లోను పాల్గొనను అని రోజా ప్రకటించారు. మంత్రిగా పూర్తి సమయాన్ని తాను వెచ్చించాల్సి ఉంటుందని... ఈ సమయంలో సినిమాలు , షోలకు సమయం కేటాయించలేనని ఆమె స్పష్టం చేశారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని రోజా పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout