ఏపీలో కొత్త జిల్లాలు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు!

  • IndiaGlitz, [Tuesday,November 10 2020]

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీల్లో ఒక్కో కమిటీకి కొన్ని కార్యకలాపాలను అప్పగించారు. కమిటీ-1ను జిల్లాల సరిహద్దులు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి.. కమిటీ-2ను నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి.. కమిటీ- 3ని ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి.. కమిటీ-4ను ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి ఏర్పాటు చేశారు.

కాగా రాష్ట్రంలో ఏర్పడబోయే జిల్లాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఏర్పడబోయే జిల్లాలతో పాటు ఆయా జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా సైతం వైరల్ అవుతోంది. ఏపీలో మొత్తంగా 32 జిల్లాలు ఏర్పడబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయా జిల్లాలతో పాటు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది


ఆంధ్రప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు: వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు

1.పలాస

ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం

2.శ్రీకాకుళం

శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం

3.పార్వతీపురం

పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ

4.విజయనగరం

విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి

5.విశాఖపట్నం

భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి

6.అరకు

అరకు, పాడేరు, జి.మాడుగుల

7.అనకాపల్లి

అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని

8.కాకినాడ

ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం

9.రాజమండ్రి

అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు

10.అమలాపురం

రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట

11.నరసాపురం

తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం

12.ఏలూరు

గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు

13.మచిలీపట్నం

కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు

14.విజయవాడ

తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం

15.అమరావతి

పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ

16.గుంటూరు

తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు

17.బాపట్ల

రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు

18.నరసరావుపేట

చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ

19.మార్కాపురం

ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి

20.ఒంగోలు

అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు

21.నెల్లూరు

కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి

22.గూడూరు

సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట

23.తిరుపతి

శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి

24.చిత్తూరు

పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం

25.మదనపల్లి

పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి

26.హిందూపురం

కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం

27.అనంతపురం

రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి

28.ఆదోని

పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం

29.కర్నూలు

నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు

30.నంద్యాల

శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం

31.కడప

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప

32.రాజంపేట

బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి

More News

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన హీరో రాజశేఖర్

ఇటీవల కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనాకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటంతో

మ‌ళ్లీ హీరోగా సునీల్‌..?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు.

సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడిస్తా.. బీజేపీ ఎంపీ శపథం

రాష్ట్రమంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల రూపంలో వచ్చిన డబ్బునే తిరిగి హైదరాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం రూపంలో

తండ్రి ఆరోగ్యంపై స్పందించిన శివాత్మిక రాజశేఖర్

తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక రాజశేఖర్ స్పందించింది. ఇటీవల హీరో రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సిటి న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

కమలా హ్యారిస్‌ టీమ్‌లో శతృఘ్నసిన్హా సోదరుని కుమార్తె!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా.. బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా తాజాగా కమలా హ్యారిస్‌తోపాటు తన సోదరుని కుమార్తె ప్రీతీ సిన్హా