ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం.. కలెక్టరేట్‌లు ఎక్కడంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ రోజు కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే వున్న 13 జిల్లాలకు తోడు అదనంగా మరో 13 జిల్లాలను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాత జిల్లాల్లో ఇప్పటికే కలెక్టరేట్‌లు వుండగా.. కొత్త వాటికి అందుబాట ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టరేట్‌లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలక్టరేట్ లను నోటిఫై చేస్తూ సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫై చేసిన చోట్ల నుంచి కలెక్టరేట్‌లు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో తెలిపారు. అలాగే ఏప్రిల్ 4వ తేదీ నుంచి అన్ని అధికారిక సమాచార లావాదేవీలు కింద పేర్కొన్న చిరునామాలకే జరగాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం


శ్రీకాకుళం కలెక్టరేట్ : కొత్తపేట జంక్షన్‌

విజయనగరం కలెక్టరేట్ : కంటోన్‌మెంట్‌

విశాఖ కలెక్టరేట్ : మహారాణిపేట

మన్యం జిల్లా కలెక్టరేట్‌ : పార్వతీపురం గిరిజన సంక్షేమ భవనం

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ : శంకరం గ్రామ పంచాయతీ

అల్లూరి సీతారామరాజు కలెక్టరేట్‌: పాడేరు నుంచి కార్యకలాపాలు

కాకినాడ జిల్లా : పాత కాకినాడ కలెక్టరేట్ నుంచే కార్యకలాపాలు

కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ : అమలాపురం నుంచి కార్యకలాపాలు

తూ.గో. కలెక్టరేట్ : రాజమహేంద్రవరం నుంచి కార్యకలాపాలు

ఏలూరు కలెక్టరేట్ : ఏలూరులోని పాత కలెక్టర్ భవనం నుంచి కార్యకలాపాలు

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ : భీమవరం లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కలశాల భవనం

కృష్ణా జిల్లా కలెక్టరేట్ : మచిలీపట్నంలోని పాత కలెక్టరేట్ భవనం

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి

గుంటూరు జిల్లా కలెక్టరేట్: గుంటూరులోని నగరంపాలెం కలెక్టర్ కార్యాలయం

బాపట్ల జిల్లా కలెక్టరేట్ : బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం భవనం

పలనాడు జిల్లా కలెక్టరేట్ : నరసరావుపేట లోని జలవనరుల శాఖ కార్యాలయ భవనం

ప్రకాశం జిల్లా కలెక్టరేట్ : ఒంగోలులోని పాత కలెక్టర్ కార్యాలయం

నెల్లూరు జిల్లా : నెల్లూరులోని పాత కలెక్టరేట్ కార్యాలయం

తిరుపతి జిల్లా కలెక్టరేట్ : తిరుపతిలోని పద్మావతి నిలయం భవనం

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ : చిత్తూరు లోని పాత కలెక్టర్ కార్యాలయం

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ : రాయచోటి లోని రాజీవ్ స్వగృహ భవనాల సమీపంలో ని ప్రభుత్వ భవనం

కడప జిల్లా కలెక్టరేట్ : కడప లోని కొత్త కలెక్టర్ కార్యాలయం సి బ్లాక్ నుంచి

అనంతపురం జిల్లా కలెక్టరేట్: అనంతపూర్ లోని పాత కలెక్టర్ కార్యాలయం

సత్యసాయి జిల్లా కలెక్టరేట్: పుట్టపర్తి లోని సత్య సాయి మిర్పూర్ సంగీత కళాశాల భవనం

కర్నూలు జిల్లా కలెక్టరేట్ : కర్నూలు లోని పాత కలెక్టర్ కార్యాలయం

నంద్యాల జిల్లా కలెక్టరేట్ : నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భవనం

More News

ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు, ఇకపై మొత్తం 26 - వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది.

‘‘ఆర్ఆర్ఆర్’’ లాగే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులు కొడుతుంది : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

విశ్వంత్, శుభశ్రీ హీరో హీరోయిన్ గా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ నూతన చిత్రం ప్రారంభం!!

దండమూడి బాక్సాఫీస్ మరియు సాయి స్రవంతి మూవీస్ పతాకంపై విశ్వంత్,శుభశ్రీ ,ఆలీ, సునీల్, రఘుబాబు,ఈ రోజుల్లో సాయి, ఖయ్యుం, సత్యం రాజేష్ నటీనటులుగా

డ్రగ్స్‌ని ఎప్పుడూ చూడలేదు.. తప్పంతా పబ్‌దే, ఏ టెస్ట్‌కైనా రెడీ : రాహుల్ సిప్లిగంజ్

హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ పబ్‌‌లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

నిహారిక పబ్‌లో వున్న మాట నిజమే .. కానీ : పుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై నాగబాబు స్పందన

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ఆవరణలోని పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ ఘటనలో పలువురు సెలబ్రెటీలు, సినీ ప్రముఖుల పిల్లలు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.