ఏపీ మంత్రివర్గం కూర్పు పూర్తి.. గన్‌మెన్లు, కార్లు సిద్ధం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ కొత్త మంత్రి వర్గం కూర్పు దాదాపు పూర్తయింది. మంత్రి వర్గంలో ఒక ముస్లిం సహా ఎనిమిది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపులు, నలుగురు రెడ్డి కులస్థులు, ఒకరు ఎస్టీ, నలుగురు కమ్మ, ఒకరు క్షత్రియ, ఒకరు వైశ్య సామాజిక వర్గాలకు స్థానం దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటి స్పీకర్ పదవి వరించింది.
గవర్నర్ చేతికి 25 మంది మంత్రుల జాబితా!
25 మంది కొత్త మంత్రులతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్.. శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా.. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకున్న గవర్నర్ నేరుగా.. గేట్ వే హోటల్‌కు చేరుకున్నారు. స్థానిక గేట్ వే హోటల్‌లో ఆయన్ని కలిసిన వైఎస్ జగన్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. కొత్త మంత్రి వర్గం జాబితాను గవర్నర్‌కు జగన్ అందజేశారు.
గన్‌మెన్లు, కార్లు రెడీ!
కాగా.. ఈ జాబితా గవర్నర్ ఆమోదించాక.. కొత్త మంత్రులకు వాహనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ కానున్నాయి. కొత్త మంత్రులకు గన్ మెన్లను సిద్ధం చేసే ప్రయత్నంలో పోలీస్ శాఖ ఉన్నట్టు సమాచారం. మంత్రి వర్గంలో చోటు దక్కింది వీరికేనని.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి ఫోన్లు వీరికేనని తెలుస్తోంది.
మంత్రివర్గంలో చోటు దక్కింది వీరికే..!
01. బొత్స సత్యనారాయణ
02. అవంతి శ్రీనివాస్
03. ధర్మాన కృష్ణదాస్
04. కొడాలి నాని
05. పేర్ని నాని
06. ఆళ్ల నాని
07. తానేటి వనిత
08. పుష్పశ్రీ వాణి
09. మేకతోటి సుచరిత
10. కురసాల కన్నబాబు
11. పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ)
12. పినిపే విశ్వరూప్
13. చెరుకువాడ శ్రీరంగనాథరాజు
14. బాలినేని శ్రీనివాస్ రెడ్డి
15. వెల్లంపల్లి శ్రీనివాస్
16. మోపిదేవి వెంకటరమణ (ఎమ్మెల్సీ)
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వైసీపీ మంత్రుల రెండో జాబితా ఇదీ..
01. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే- వెల్లంపల్లి శ్రీనివాస్(వైశ్య)
02.మచిలీపట్నం ఎమ్మెల్యే- పేర్ని నాని(కాపు)
03. గుడివాడ- కొడాలి నాని(కమ్మ)
04. ప్రత్తిపాడు ఎమ్మెల్యే- మేకతోటి సుచరిత
05. ఒంగోలు ఎమ్మెల్యే- బాలినేని శ్రీనివాసరెడ్డి
06. కురుపాం ఎమ్మెల్యే- పుష్పశ్రీవాణి
07. ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథ రాజు(క్షత్రియ)
08. మోపిదేవి వెంకటరమణ(బీసీ) (ఎమ్మెల్సీ)
09. బొత్స సత్యనారాయణ- చీపురుపల్లి ఎమ్మెల్యే
10. పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ)
11. ధర్మాన కృష్ణదాస్- నరసన్నపేట ఎమ్మెల్యే
12. కొవ్వూరు ఎమ్మెల్యే- తానేటి వనిత
13. కురసాల కన్నబాబు(కాపు)- కాకినాడ రూరల్ ఎమ్మెల్యే
14. పినిపె విశ్వరూప్- అమలాపురం
15. భీమిలి ఎమ్మెల్యే- అవంతి శ్రీనివాస్
16. ఆత్మకూరు ఎమ్మెల్యే - మేకపాటి గౌతం రెడ్డి
17. కడప ఎమ్మెల్యే - అంజాద్ బాషా
18. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పుంగనూరు ఎమ్మెల్యే
19. ఆళ్ల రామకృష్ణా రెడ్డి- మంగళగిరి ఎమ్మెల్యే
20. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి(బ్రాహ్మణ)- డిప్యూటీ స్పీకర్
21. తమ్మినేని సీతారాం(బీసీ)- స్పీకర్
జాబితాలో లేని ఆశావహుల పేర్లు
01. సత్తెనపల్లి ఎమ్మెల్యే- అంబటి రాంబాబు
02. నగరి ఎమ్మెల్యే- ఆర్‌కే రోజా
03. డోన్ ఎమ్మెల్యే- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
04. చిలకలూరిపేట- మర్రి రాజశేఖర్
05. కర్నూలు జిల్లా- శిల్పా కుటుంబం
06. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే- అనిల్ కుమార్ యాదవ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout