పవన్‌కు కొత్తపేరు పెట్టిన ఏపీ మంత్రి!
- IndiaGlitz, [Tuesday,November 12 2019]
ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంగ్లీష్ బోధన’ వ్యవహారాలు కాస్త వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించడంతో రెండు పార్టీల మధ్య ఈ వివాదం మరింత పెరిగింది. తెలుగు భాష గురించి పవన్ కల్యాణ్ వరుస ట్వీట్స్ చేయడం.. పవన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా రియాక్ట్ అయ్యారు. అయితే విమర్శకులందరికీ సింగిల్ మాటతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అయితే ఈ కౌంటర్‌కు పవన్ మళ్లీ రియాక్ట్ అయ్యారు. పవన్ కామెంట్స్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పవన్‌కు కొత్తపేరు పెట్టిన నాని!
పవన్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించిన నాని.. ఈ సందర్భంగా జనసేనానికి ‘పవన్ నాయుడు’ అని కొత్తపేరు పెట్టారు!. జగన్ చేస్తోన్న మంచి పనులు పవన్ నాయుడికి కనిపించడం లేదని దుయ్యబట్టారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంటే.. ఇవేవీ పవన్‌కు కనిపించడం లేదని మంత్రి కన్నెర్రజేశారు. పవన్ నాయుడికి కేవలం ఇసుక లేకపోవడం మాత్రమే కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. ‘గోదావరి, కృష్ణా నదుల్లో ఇప్పటికీ వరద సముద్రంలోకి వెళ్తోంది పవన్ నాయుడు గారూ. కేవలం చంద్రబాబు చెప్పిన మాటలు వినే పవన్ రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ నాయుడు.. టీడీపీ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదు. చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే.. దూడ కట్టేసేందుకు పవన్ వస్తున్నారు. బాబు మీద ప్రేమ ఉన్న పవన్‌కు జగన్ చేసే మంచి పనులు కనిపించవు’ అని పవన్‌పై ఓ రేంజ్‌లో మంత్రి విమర్శలు గుప్పించారు.
ఇక్కడ్నుంచి టెన్ థౌజండ్ వాలా!
‘పవన్‌కు పెళ్లిళ్ల విషయంలో మక్కువ ఉంటే.. జగన్‌కు ప్రజాసేవ, వ్యాపారాల పట్ల మక్కువ ఉంది. జగన్‌కు తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కాబట్టే మీరేం మాట్లాడినా 2017 వరకు ఆయన స్పందించలేదు. పవన్‌కు నరనరాన కుల భావన నరనరాన జీర్ణించుకుపోయింది. సినిమా రైటర్ రాసిస్తే జగన్‌పై విమర్శలు చేయడం సబబు కాదు. పవన్ అరుపులు, కేకలు సినిమాల వరకే.. ఆ విషయం జనసేనానికి కూడా తెలుసు. పవన్ నాయుడు ఇది సినిమా కాదు. మీరు థౌజండ్ వాలా అంటిస్తే.. ఇక్కడ్నుంచి టెన్ థౌజండ్ వాలా అంటిస్తారు’ అని పవన్‌కు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాని వ్యాఖ్యలకు పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.