మంత్రి హోదాలో ప్రగతి భవన్‌కు రోజా.. కేసీఆర్‌తో భేటీ, బొట్టుపెట్టి సత్కరించిన సీఎం ఫ్యామిలీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రోజా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం సతీశణి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవితలు సాంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి వస్త్రాలు బహూకరించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికే ప్రగతి భవన్‌కు వచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ తనను ఓ కూతురి మాదిరిగా చూస్తారని చెప్పారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రోజా కౌంటరిచ్చారు. ఏపీ విషయంలో ఆయనను ఎవరో తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పొరుగు రాష్ట్రాలు అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అనలేదని రోజా ప్రస్తావించారు. ఒక వేళ ఏపీ గురించి అని ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె చెప్పారు. కేటీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నానని, ఆయనతో పాటు ఆయనకు చెప్పిన ఫ్రెండ్ కూడా వస్తే.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరుండి చూపిస్తానని రోజా స్పష్టం చేశారు.
ఏపీ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారని.. నాడు-నేడు కింద బడులు, ఆసుపత్రులు ఎలా అభివృద్ధి చేశామో చూపిస్తామని ఆమె పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని... కొవిడ్ తర్వాత రాష్ట్రంలో 9 వేల కిలోమీటర్ల అంతర్గత రహదారులు ఏ విధంగా వేస్తున్నారో చూపిస్తామని రోజా చెప్పారు. కేంద్రంతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం ఎలా జరిగిందో వివరిస్తామని.. అవినీతికి తావులేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. కేటీఆర్ తేదీ, సమయం ఇస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రమంతా తిరిగి చూపిస్తానని ఆమె పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout