RK Roja:కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడగలవా, మక్కెలిరగ్గొడతారు .. జగన్ పెద్ద మనసు వల్లే తిరుగుతున్నావ్: పవన్‌పై రోజా ఫైర్

  • IndiaGlitz, [Wednesday,July 12 2023]

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు వైసీపీ నేత, మంత్రి ఆర్కే రోజా. పవన్ చేసిన వ్యాఖ్యల్లో మహిళ అక్రమ రవాణా అనే ఆరోపణ తనకు నచ్చలేదన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లపై వ్యాఖ్యలు సరికాదని.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి చెప్పారు. పవన్ కల్యాణ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. చివరికి ముఖ్యమంత్రి జగన్‌ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. వాలంటీర్లను చూసి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వణుకుతున్నారని అందుకే వారిపై విషం చిమ్ముతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

అప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీమ్‌ పెట్టుకున్నావా :

వాలంటీర్ల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో వాళ్లే నీ అంతు తేలుస్తారని పవన్‌ కళ్యాణ్‌ను రోజా హెచ్చరించారు. వుమెన్ ట్రాఫికింగ్ కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారా.. ఈ విషయంలో ఏపీ టాప్ 10లో లేదని.. తెలంగాణనే ఆరో స్థానంలో వుందని అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించగలవా అని రోజా నిలదీశారు. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా.. నీ మక్కెలు ఇరగ్గొడతారంటూ హెచ్చరించారు. నీ అభిమానులను, నీ కోసం పని చేసే వారిని బాలకృష్ణ ఫ్యాన్స్ తిట్టారని.. కానీ ఆయన ఇంటర్వ్యూకు పిలవగానే ఎలా వెళ్లావని రోజా చురకలంటించారు. ప్యాకేజ్ కోసం నీ కుటుంబాన్ని, జనసైనికులను తిట్టిన వారిని వెనకేసుకొస్తున్నావా అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి నీకు లేదని.. ఆయన ఎప్పుడైనా నీ కుటుంబాన్ని విమర్శించారా అని రోజా నిలదీశారు. చంద్రబాబు హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వెలుగు చూసినప్పుడు నీ నోరు హెరిటేజ్ ఐస్‌క్రీమ్‌తో నిండిందా అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు నీ బోడి గౌరవం కావాలా :

మాట్లాడితే విప్లవం అని గొంతు చించుకునే పవన్ కల్యాణ్.. గంట సేపు కూడా ధర్నా చేశాడా అని ఆమె ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను విదేశాలు సైతం అమల్లోకి తెస్తున్నాయని రోజా తెలిపారు. జగన్ ను ఏకవచనంతో పిలుస్తానని అంటావా.. నీ బోడి గౌరవం ఎవరికి కావాలి, ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని రోజా వ్యాఖ్యానించారు. జగన్ 36 ఏళ్లకే ఎంపీ అయ్యారని, 38 ఏళ్లకే రికార్డ్ స్థాయి ఓట్లతో రెండోసారి ఎంపీగా గెలిచారని మంత్రి గుర్తు చేశారు.

అంజనా దేవికి రోజా క్షమాపణలు :

నీ తల్లి చాలా గొప్పదని.. నీ వల్ల అందరూ ఆమెను అనే పరిస్ధితి వచ్చిందని రోజా పేర్కొన్నారు. ఇదే సమయంలో అమ్మా నన్ను క్షమించు అంటూ అంజనా దేవికి ఆమె క్షమాపణలు చెప్పారు. రోడ్లపై గన్నులు పట్టుకుని తిరిగేవాడు క్రిమినలా.. ప్రజలకు సేవ చేసే జగన్ క్రిమినలా చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ గొప్ప మనసు కారణంగానే పవన్ ఇంకా బతికి బట్టకడుతున్నారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 51 శాతం ఓట్లతో పవన్ వైసీపీని ఒంటి చేత్తో గెలిపించారని.. కరోనా సమయంలో చంద్రబాబు, పవన్, లోకేష్‌లు హైదరాబాద్‌లో దాక్కున్నారని ఆమె దుయ్యబట్టారు. ఆ సమయంలో జనసేన, టీడీపీ కేడర్‌కు సేవ చేసింది ఈ వాలంటీర్లేనని రోజా గుర్తుచేశారు. 2024లోనూ జగనన్న వన్స్ మోర్.. బైబై బీపీ అని చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని ఆమె జోస్యం చెప్పారు.

More News

TFCC:తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు మోగిన నగారా : బరిలో దిల్‌రాజు, సి కళ్యాణ్ .. పోటీ నువ్వా నేనా

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది.

Pawan Kalyan:మహిళ రవాణాపై వ్యాఖ్యలు : ఏపీలో భగ్గుమన్న వాలంటీర్లు .. పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం, చెప్పులతో కొడుతూ నిరసన

వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.

Bus Accident:పెళ్లింట పెను విషాదం : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా..

Perni Nani:జగన్‌ను ఏకవచనంతో పిలుస్తావా.. పిలిచి చూడు, చిరంజీవి నీ గురించి చెప్పింది నిజమే : పవన్‌పై పేర్ని నాని ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గాను వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు.

Pawan Kalyan:చిక్కుల్లో జనసేనాని : పవన్‌కు ఏపీ మహిళా కమీషన్ నోటీసులు, 10 రోజులు డెడ్‌లైన్.. లేదంటే క్షమాపణ చెప్పాల్సిందే

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చిక్కుల్లోపడ్డారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ సోమవారం నోటిసులు జారీ చేసింది.