మోహన్‌బాబు వద్దకు మంత్రి పేర్నినాని.. ఈ కొత్త ట్విస్ట్ ఏంటో, టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మంత్రి పేర్ని నాని.. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం భేటీ అయిన వివరాలను మోహన్‌బాబుకు మంత్రి పేర్ని నాని వివరించారు.
నిన్నటి భేటీకి మోహన్ బాబు హాజరు కావడం.. ఇప్పుడు స్వయంగా మంత్రి పేర్ని నాని హైదరాబాద్ వచ్చి పెదరాయుడితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ నెలాఖరులోపు సినీ ప్రముఖులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం జీవోలు జారీ చేయనుంది.
మోహన్ బాబు, మంత్రి పేర్నినాని భేటీ అయినట్లు మంచు విష్ణు ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. ‘ఈ రోజు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని.. టిక్కెట్ ధరలపై చొరవ చూపినందుకు మంత్రి నానికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వ ప్లాన్ లపై మాకు అప్ డేట్ చేశారని.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయోజనాలను కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. మంత్రి పేర్నినాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఏం చర్చించుకున్నారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడిందనుకుంటున్న సమయంలో కొత్త ట్విస్టులు తెరపైకి రావడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments