సినిమా టికెట్ల వివాదం.. వైరలవుతున్న త్రివిక్రమ్ ట్వీట్, జగన్ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల విక్రయం పెద్ద దుమారం రేపోతోంది. అప్పుడే జగన్ ఈ నిర్ణయాన్ని అమలు చేయరని భావించిన సినీ ప్రపంచానికి ఆయన షాకిచ్చారు. ఏకంగా బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ శ్లాబులు, ఆన్లైన్లో టికెట్ల అమ్మకానికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చి.. ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. దీంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఎలా వుంటే అలా టికెట్ల రేట్లు పెట్టాలని.. అలాగే లక్షలాది కుటుంబాలు ఆధారపడ్డ సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని రేట్ల విషయంలో పునరాలోచించాలని చిరు సూచించారు. తాజాగా దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.
‘చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు అన్నట్లుగానే... ప్రతి పాఠశాలలలోనూ ఒకటే ఫీజు, ప్రతి ఆసుపత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు? పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా? అంటూ సినీ దర్శకుడు త్రివిక్రమ్ తనస్టైల్లో ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. దీనిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి చిరంజీవితోపాటు ఎవరు చెప్పిన అంశాలనైనా సీఎం దృష్టికి తీసుకెళ్లడమే నా పని అన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ జగన్ దగ్గరే ఉందని... అందువల్ల ఆన్లైన్ టికెట్ల అంశాన్ని సినీ ప్రముఖులతో చర్చించాలని ఆయన చెబితేనే మాట్లాడా అని పేర్ని నాని వివరించారు. శుక్రవారం మంత్రి పేర్ని నాని ఆన్లైన్ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తీసుకురానున్న టికెటింగ్ వెబ్సైట్, యాప్ రూపకల్పనపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో బుక్ మై షో, పేటీఎం, జస్ట్ బుకింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments