చివరిదశలో ఉన్న ‘జేసీ’తో మాకేం పని: మంత్రి నాని
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ ముఖ్యనేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరమని తనను కొందరు కోరుతున్నారని.. అలాగైతే కేసులు ఏమీ ఉండవని అంటున్నారని జేసీ వ్యాఖ్యానించారు. ఒక్క దివాకర్ ట్రావెల్సే నిబంధనలు అతిక్రమించిందా?.. మిగిలిన వాళ్ల బస్సులు ఎన్ని సీజ్ చేశారు? అని ఈ సందర్భంగా సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రిబ్యునల్ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు విడిచిపెట్టడం లేదని వాపోయారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
జేసీతో మాకేం పని..?
‘జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారు..?. రాజకీయాల్లో చివరిదశలో ఉన్న జేసీతో మాకేం పని..?. బస్సులో సీజ్ విషయంలో జేసీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. చట్టం ప్రకారమే మేం వ్యవహరిస్తున్నాం’ అని మంత్రి నాని వ్యాఖ్యానించారు.
అసలు జేసీ ఏమన్నారు..!?
‘ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో కొందరిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారు. రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువ అవుతుంది. హద్దు మీరి పరిపాలన జరుగుతోంది. మైనింగ్‌పై కూడా కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. సీఎం చెప్పినట్లు వినకపోతే సీఎస్‌ను బదిలీ చేసినట్లుగా మాకు జరుగుతుందని అధికారులు భయపడుతున్నారు. 74 సంవత్సరాలు ట్రాన్స్‌పోర్ట్‌లో నాకు అనుభవం ఉంది’ అని మీడియాతో మాట్లాడుతూ జేసీ వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com