చంద్రబాబును జగన్ ఓడించారని ట్రంప్‌కు కోపం!

  • IndiaGlitz, [Tuesday,February 25 2020]

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పర్యటకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆహ్వనం రాలేదంటూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన ప్రచారం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు చెప్పుకొచ్చారు.

ట్రంప్‌తో ఫోటోలు దిగాలని గానీ.. జాతీయ నేతలతో కలిసి చేతులు ఊపాలని జగన్‌కు లేదన్నారు. జగన్‌ ఎప్పుడూ ప్రజలతో ఉండాలనే కోరుకుంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు భయపడుతున్నారు కాబట్టే ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని కురసాల విమర్శల వర్షం కురిపించారు.

జగన్.. ట్రంప్ పక్కన కూర్చునే వ్యక్తే కానీ..!

‘సోషల్‌ మీడియాలో చూస్తున్నాం. ట్రంప్‌ విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా అని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. అమెరికాలో నన్ను ఓడిస్తానన్న చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారంటే జోలె పట్టుకొని తిరుగుతున్నారని సమాధానం చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని ట్రంప్‌ అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. వైయస్‌ జగన్‌కు అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల చేతులు పట్టుకొని తిరగాలన్న కోరికలు ఏమీ లేవు. నిరంతరం ప్రజల్లో ఉండాలి.. ప్రజల మనస్సుల్లో నిలిచిపోవాలన్నదే జగన్‌కు కోరిక ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌కు ట్రంప్‌ ప్రక్కన కూర్చోనే స్థాయి ఉన్న వ్యక్తే.. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే పొలాలకు తీసుకెళ్లారు’ అని కురసాల చెప్పుకొచ్చారు.

బాబును ఓడించినందుకు ట్రంప్‌కు కోపం!

‘ఇవాళ ట్రంప్‌ దేశానికి వస్తే రాష్ట్రపతికి ఉన్న క్రైటీరియా ప్రకారం 8 మంది సీఎంలను మాత్రమే పిలిచారు. ఇది చంద్రబాబుకు తప్పుగా కనిపించింది. చంద్రబాబును జగన్‌ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చి ఉంటుంది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా?. ఇదే ట్రంప్‌ను ఓడిస్తానని చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ట్రంప్‌ గెలిచాడు. వైయస్‌ జగన్‌ను ఓడిస్తానని రాష్ట్రమంతా తిరిగితే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. దేశమంతా చంద్రబాబు తిరిగి మోదీని ఓడిస్తానన్నారు. చంద్రబాబును జనం ఎక్కడ కూర్చోబెట్టారో మనం చూశాం. ఇప్పుడేమో మోదీతో గొడవ పెట్టుకొని తప్పు చేశామని అంటున్నాడు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి వలస పంపించారు. ఇదేం రాజకీయమో అర్థం కావడం లేదు. ఇంత దారుణంగా నాయకులు ఉంటారా..? అని ఆవేదనగా ఉంది. వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు వణుకు పుడుతుంది’ అని మంత్రి కురసాల వ్యాఖ్యానించారు.

More News

పూరితో ప‌వ‌ర్‌స్టార్‌..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

నిర్మాత‌గా మారుతున్న చైత‌న్య‌

అక్కినేని వార‌సుల్లో మూడో త‌రం హీరోలుగా అక్కినేని చైత‌న్య‌, అఖిల్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే.

భారత్ పర్యటన ఎప్పటికీ మర్చిపోలేను: ట్రంప్

అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీనియర్ నటి ఫైర్!

దేశ రాజధానిలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ఢిల్లీలో హింసాత్మకంగా మారింది.

టెక్సాస్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు అక్కడికక్కడే మృతిచెందారు.