‘పవన్.. నువ్ ఏ రోజైనా చిరంజీవి పేరు చెప్పావా?’
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ తలపెట్టిన లాంగ్‌మార్చ్ తర్వాత వైసీపీ-జనసేన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇసుక కొరతపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నా, లేకున్నా వైఎస్ జగన్‌నే టార్గెట్ చేసి మాట్లాడడమేంటి..?. చంద్రబాబు తప్ప మరో నాయకుడు పవన్‌కు కనపడడంలేదా..? ‘నా రాజకీయ జీవితంలో ఎలాంటి దాపరికం లేదు.. చిరంజీవి గారి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని నేటికీ చెబుతాను. కానీ పవన్ కల్యాణ్ ఏనాడైనా చిరంజీవి గారి పేరు చెప్పారా?. సినిమాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి తమ్ముడని చెప్పుకున్న పవన్ ఇప్పుడు కానిస్టేబుల్ కొడుకుని, పోస్టుమెన్ మనవడిని అని కొత్తగా బ్రాండింగ్ చేసుకుంటున్నారు’ అని పవన్‌పై కన్నబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే మంత్రి ఈ మాటలు ఎందుకు అన్నారంటే.. విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ కన్నబాబు బతుకు తమకు తెలియంది కాదని, కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చింది తామేనని అనడంతో ఇందుకు కౌంటర్‌గా పై విధంగా కౌంటర్లు, ప్రశ్నలల వర్షం కురిపించారు.
కనీసం జ్ఞానం కూడా లేదా!?
‘పవన్ కల్యాణ్ సినిమాలు వదిలినా.. యాక్టింగ్ వదల్లేదు. పవన్ డ్రామాలు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ యాక్టింగ్ పండడం లేదు. చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటే పవన్‌కు కోపంతో లాంగ్ మార్చ్ చేశాడు.. కానీ, భవన నిర్మాణ కార్మికులపై చిత్తశుద్ధితో కాదని స్పష్టంగా అర్థమవుతుంది. కార్మికుల సంక్షేమ నిధిని కాజేసిన అచ్చెన్నాయుడిని పక్కనబెట్టుకొని మాట్లాడిన పవన్‌కు కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మాట్లాడితే నీ బతుకు నాకు తెలుసని అంటున్నాడని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన బతుకులు కాదు ప్రజల బతుకుల గురించి ఆలోచించాలనే కనీసం జ్ఞానం కూడా పవన్‌కు లేదా..?’ అని ఈ సందర్భంగా పవన్‌పై కన్నబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments