'జూన్ 1:43' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదిత్య, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం `జూన్ 1:43`. ఈ సినిమా ఆడియో సీడీలను ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రవణ్ సంగీతం అందించారు.
చిత్ర నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ - ``దర్శకుడు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాను భాస్కర్‌గారు సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఆదిత్య, రిచా అందరూ చక్కగా నటించారు. మల్హర్‌భట్ జోషిగారు, శ్రవణ్ సహా టెక్నిషియన్స్ ఎంతో సపోర్ట్ చేయడంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. శ్రవణ్ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. మ్యూజిక్‌తో పాటు ఎక్స్ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కృష్ణకాంత్‌గారు మంచి సాహిత్యాన్ని అందించారు. డీ మానిటైజేషన్ సమయంలోనే సినిమాను స్టార్ట్ చేశాం. అయినా సినిమాలో పనిచేసిన వారందరికీ చెక్కులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ద్వారా పక్కా పేమెంట్స్‌ను చేసేశాం. ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. అలాగే అందరూ ఈ సినిమాను తమదిగా భావించి సినిమా చక్కగా రావడంతో తమదైన తోడ్పాటును అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం `` అన్నారు.
ఆదిత్య మాట్లాడుతూ - ``మంచి రోల్ చేశాను. భాస్కర్‌గారు సినిమాను ఆద్యంతం ఎంతో చక్కగా తెరకెక్కించారు. నటీనటులు, టెక్నిషియన్స్ అందించిన సహాకారంతో సినిమాను పూర్తి చేయగలిగాం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
దర్శకుడు భాస్కర్ బంటుపల్లి మాట్లాడుతూ - ``లక్ష్మిగారు అందించిన సపోర్ట్‌తోనే సినిమాను చేయగలిగాను. నేను చెప్పిన కథ కొత్తగా ఉండి, నచ్చడంతో లక్ష్మిగారు సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అందరం కష్టంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా బాగా వచ్చింది. మల్హర్‌భట్ జోషి సినిమాటోగ్రఫీ, శ్రవణ్ సంగీతం సినిమాను నెక్ట్స్ రేంజ్లో నిలిపాయి`` అన్నారు.
ఆదిత్య, రిచా, వేణు, సాయి, బన్ను, కాశీవిశ్వనాథ్, మధుమణి, తోటపల్లి మధు, కేధార్ శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ః ఎస్.బి.ఉద్ధవ్, కెమెరాః మల్హర్ భట్ జోషి, మ్యూజిక్ః శ్రవణ్, నిర్మాతః లక్ష్మి, రచన, దర్శకత్వంః భాస్కర్ బంటు పల్లి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments