రివర్స్ టెండరింగ్ విధానంతో బాబు అవినీతి బట్టబయలు: మంత్రి అనిల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంపై మాట్లాడిన ఆయన.. ఈ విధానం ద్వారా టీడీపీ అవినీతి బట్టబయలు అవుతుందన్నారు. రివర్స్ టెండరింగ్ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. బాబు హయాంలో ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా కపెంనీకి 4.77శాతం ఎక్కువకు టెండరింగ్ ఇచ్చారని .. అదే కంపెనీకి జగన్ సర్కార్ 15శాతం తక్కువకు టెండరింగ్ ఇచ్చిందన్నారు.
తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వానికి రూ. 58 కోట్ల లాభం వచ్చిందని... కావున రివర్స్ టెండరింగ్ ద్వారా లాభాలే తప్పా నష్టాలు లేవన్నారు అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ హయాంలో ప్రతీ పనికి వ్యయాన్ని పెంచుకుంటూ పోయారని... అయినా రూ. 36వేల కోట్ల పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. కానీ బాబు మాత్రం పనులన్నీ పూర్తి అయ్యాయని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout