టాలీవుడ్‌కు ఊరట.. జగన్ సర్కార్‌కు షాక్, సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

  • IndiaGlitz, [Tuesday,December 14 2021]

సినిమా టికెట్‌ ధరల విషయంలో ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ గతంలో ఇచ్చిన జీవో నెం.35ను న్యాయస్థానం మంగళవారం సస్పెండ్‌ చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సవాల్‌ చేస్తూ రాష్ట్రంలోని థియేటర్‌ యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్‌ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు స్పష్టం చేశారు. దీనిపై ఈరోజు ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణ రావు, దుర్గా ప్రసాద్‌ పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. టికెట్‌ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందవర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మరి కోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.

మరోవైపు రాష్ట్రంలోని థియేటర్లలో బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో పాటు టికెట్లను ఆన్‌లైన్‌లోనే విక్రయించేందుకు వీలుగా ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

More News

రానా పుట్టినరోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' నుంచి  డేనియల్ శేఖర్ మరో ప్రచార చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  'భీమ్లా నాయక్'.

‘బంగార్రాజు’ స్పెషల్ సాంగ్‌లో ఫరియా అబ్దుల్లా

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. తెరకెక్కించనున్న ప్రకాశ్ ఝా, ఆహాలో స్ట్రీమింగ్

తెలుగు జాతి సత్తాను , సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హౌస్‌లో స్వీట్ మెమొరీస్.. ఆ సర్‌ప్రైజ్‌కి శ్రీరామ్, మానస్ ఎమోషనల్

బిగ్‌బాస్ 5 తెలుగు 100వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.