‘వకీల్ సాబ్’కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం నిన్న(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు అడ్డంకులు సృష్టించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు హైకోర్టును ఆశ్రయించగా... వారికి ఊరటనిచ్చే తీర్పును కోర్టు వెలువరించింది. నిజానికి పవర్ స్టార్ సినిమాయే కాదు.. ఏ పెద్ద హీరో సినిమా విడుదలైనా బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం థియేటర్ల యజమానులకు ఉంటుంది.
ఇప్పుడిప్పుడే థియేటర్లు కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమా రిలీజ్ అనగానే.. థియేటర్ల యాజమాన్యాలు సైతం తాము మరింత కోలుకునేందుకు ఈ సినిమా పెద్ద అవకాశమని భావించాయి. టికెట్ల రేట్లను పెంచాలని భావించాయి. అయితే ఈ సినిమా విషయమై రాత్రికి రాత్రి కొన్ని జీవోలు విడుదలయ్యాయి. ప్రత్యేకంగా టికెట్ల రేట్లను పెంచింది. అంతకు మించి అమ్మితే థియేటర్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్ర అని.. రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని అభిమానులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఈ విషయంపై ఏపీ హైకోర్టును సంప్రదించారు. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ.. ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లకు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్‌తో పాటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com