చంద్రబాబుకు బిగ్ షాక్.. సీఐడీ కస్టడీకి కోర్ట్ అనుమతి

  • IndiaGlitz, [Friday,September 22 2023]

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయనను రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే న్యాయమూర్తి రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించారు. అంతేకాదు.. టీడీపీ అధినేతను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని ఆదేశించారు.

జైల్లోనే చంద్రబాబు విచారణ :

ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లకు అనుమతించింది. చంద్రబాబును విచారించే అధికారుల పేర్లు కోర్టు సమర్పించాలని, విచారణ వీడియోలు బయటకు రాకుండా చూడాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. ఆదివారం కస్టడీ ముగిసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపరచాలని సూచించారు. దీనిపై స్పందించిన సీఐడీ అధికారులు .. చంద్రబాబును జైల్లోనే విచారిస్తామని కోర్టుకు తెలిపింది.

విచారణ కీలక దశలో జోక్యం చేసుకోలేం :

ఇక 68 పేజీల క్వాష్ ఆర్డర్ కాపీలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపమనడం సరికాదని.. క్వాష్ పిటిషన్లను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటామని పేర్కొంది. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలని, సీఆర్‌పీసీ 482 కింద దాఖలైన పిటిషన్‌పై మినీ ట్రయల్ నిర్వహించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. 2021 నుంచి 140 మందిని ఈ కేసులో సీఐడీ విచారించిందని, 4000 డాక్యుమెంట్లు సేకరించిందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది.

More News

Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు .. క్వాష్ పిటిషన్ కొట్టివేత

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

Nandamuri Balakrishna:ఏపీ అసెంబ్లీలో బాలయ్య రచ్చ  : విజిల్స్ వేస్తూ, సీట్లపైకెక్కి నినాదాలు.. స్పీకర్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సభలో నానా హంగామా సృష్టించారు.

Chandrababu Naidu: చంద్రబాబుకు ఏసీబీ కోర్ట్ షాక్, జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది.

Bigg Boss 7 Telugu : గౌతమ్‌కు అన్యాయం .. సందీప్‌పై గుస్సా, ప్రియాంకకున్న ధైర్యం అమర్‌‌కు లేకపోయే

బిగ్‌బాస్ 7 తెలుగులో మూడో హౌస్‌మెట్ ఛాన్స్ కొట్టేసేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ పడుతున్నారు. శోభాశెట్టి, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్‌లను

తొడలు కొట్టుడేంది, మీసాలు తిప్పుడేంది : అసెంబ్లీ వేదికగా టీడీపీ 'గలీజు' రాజకీయం, బాబు కోసం ఇంత రచ్చా..?

చట్టసభలన్న గౌరవం లేదు.. సభాపతి అన్న మర్యాద లేదు. సభా సాంప్రదాయలను మంటగలిపి, కోట్లాదిమంది ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం లేకుండా ప్రవర్తించారు