CM Jagan:సీఎం జగన్ సహా 41 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తెలిపారు. రఘురామ కృష్ణంరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. దీంతో న్యాయస్థానం పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. దీంతో సీఎం జగన్ సహా 41 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే సీఎం జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని విచారణ వేగవంతం చేయాలన్న రఘురామ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్ కోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను రఘురామ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.

మరోవైపు పదేళ్లుగా నెమ్మదిగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని.. విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదని తెలిపారు. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అలాగే రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

More News

Dalari:అన్నదమ్ముల కథ , వ్యవస్థలో లోపాలను టచ్ చేసే ‘‘దళారి’’ .. మరో బలగం అవుతుందన్న సినీ ప్రముఖులు

రాజీవ్‌ కనకాల, షకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక నటీనటులుగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో

Dhootha : అక్కినేని నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ చూశారా.. క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో అదరహో

హిట్టు , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే నటుల్లో అక్కినేని వారసుడు నాగచైతన్య ఒకరు.

Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌ను నమ్మించి బలి చేసిన శివాజీ.. శోభతో గొడవ , లాఠీ విసిరికొట్టిన అమర్‌దీప్ .. రతికతో గౌతమ్ లవ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 80 రోజులు  పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది.

Yuvagalam Padayatra:ఈనెల 27న 'యువగళం' పాదయాత్ర పున:ప్రారంభం.. రూట్ మ్యాప్ ఖరారు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

KTR:సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయం.. ఆడియో కాల్ వైరల్..

తెలంగాణ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ప్రచారానికి ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో