అసెంబ్లీకి ఆ అధికారం లేదు.. ఏ కార్యాలయాన్ని తరలించొద్దు: అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని సర్కార్‌ను ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతేకాదు.. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి ఆ భూములను తాకట్టు పెట్టడానికి వీల్లేదని పేర్కొంది.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని.. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ధారించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని.. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని న్యాయస్ధానం సూచించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని.. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కోర్టు పేర్కొంది. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని... అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని న్యాయస్ధానం ఆదేశించింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని సూచించింది.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లన్నీ నిరర్థకం అవుతాయని.. వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. నేడు 75 కేసుల్లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com