అసెంబ్లీకి ఆ అధికారం లేదు.. ఏ కార్యాలయాన్ని తరలించొద్దు: అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

  • IndiaGlitz, [Thursday,March 03 2022]

ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని సర్కార్‌ను ఆదేశించింది. చీఫ్ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతేకాదు.. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి ఆ భూములను తాకట్టు పెట్టడానికి వీల్లేదని పేర్కొంది.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని.. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ధారించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని.. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని న్యాయస్ధానం సూచించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని.. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కోర్టు పేర్కొంది. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని... అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని న్యాయస్ధానం ఆదేశించింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని సూచించింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లన్నీ నిరర్థకం అవుతాయని.. వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. నేడు 75 కేసుల్లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

More News

యుద్ధాన్ని ఆపాలని నేను పుతిన్‌ను ఆదేశించగలనా : సీజేఐ జస్టిస్ ఎన్. వీ. రమణ

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

'డై హార్డ్ ఫ్యాన్' నుంచి హీరో శివ ఆలపాటి లుక్ కు విశేష స్పందన..

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.12 కోట్లు సుపారీ

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత వీ. శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. మరో భారతీయ విద్యార్ధి మృతి

ఉక్రెయిన్- రష్యా యుద్ధం భారతీయుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇప్పటికే నిన్న ఖార్కీవ్‌లో రష్యా సైనికుల దాడిలో

తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అందరిముందు చెప్పుతో కొట్టుకున్నారు. ఆయనేందుకు ఇలా చేశారంటే...