Tiger Nageswara Rao:టైగర్ నాగేశ్వరరావుకు షాక్.. రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్, కారణమిదే
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. 1970-80 దశకాల్లో స్టువర్ట్ పురం ప్రాంతంలో నివసించిన టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ జీవిత కథ ఆథారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావుకు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దశాబ్ధాల క్రితం జరిగిన విషయాలపై మళ్లీ సినిమా చేయడం ద్వారా ఒక వర్గాన్ని కించపరచడమేనని న్యాయవాది పృథ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామాకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
ఇప్పటికే స్టువర్ట్ పురంలో నివసించే (ఎరుకల) సామాజిక వర్గాన్ని దొంగలుగా చూపించారని.. తమ గ్రామాన్ని నేరగ్రామంగా చిత్రీకరించారని , అభ్యంతరకరమైన పదజాలంతో చూపించారని ఆ వర్గం మండిపడుతోంది, అంతేకాదు.. ఏపీ సినిమాటోగ్రఫి కమీషనర్‌కు, ఏపీ డీజీపీకి కూడా లేఖలు రాశారు. వెంటనే టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు.
ఇకపోతే.. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ సరసన గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్, జిషు సేన్ గుప్తాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments