Nara Lokesh:ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : లోకేష్‌కు షాక్ .. బెయిల్ పిటిషన్‌ డిస్పోస్ చేసిన హైకోర్ట్, నోటీసులిచ్చేందుకు సీఐడీ రెడీ

  • IndiaGlitz, [Friday,September 29 2023]

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం డిస్పోస్ చేసింది. అంతేకాదు.. ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ధర్మాసనం ఆదేశించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని లోకేష్‌కు తేల్చి చెప్పింది. లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. సీఐడీ వాదనలను పరిగణనలోనికి తీసుకున్న ధర్మాసనం లోకేష్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లి లోకేష్‌కు నోటీసులు ఇచ్చే అవకాశాలు వున్నాయి.

కాగా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్‌ను ఏ 14గా చేర్చించింది సీఐడీ. ఈ మేరకు విజయవాడ కోర్టులో మెమో కూడా దాఖలు చేసింది. దీంతో లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లోనూ లోకేష్ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని అత్యవసరంగా విచారించాలని ఆయన కోర్టును కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ రెండు పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం వుంది.

ఇకపోతే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. జాతీయ మీడియాకు ఏపీలోని పరిస్ధితులు తెలియజేయడంతో పాటు జాతీయ నేతలను కూడా కలవాలని లోకేష్ భావించారు. న్యాయ నిపుణులతోనూ ఆయన చర్చలు జరిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అరెస్ట్ భయంతోనే లోకేష్ ఢిల్లీ వదిలి రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.

More News

Engagement:'ఎంగేజ్మెంట్' చిత్రం షూటింగ్ పూర్తి..

సూరమ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ.. రోడియం ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం ఎంగేజ్మెంట్.

Bigg Boss 7 Telugu : యావర్ తెచ్చిన తంటా, శివాజీతో శోభాశెట్టి గొడవ .. వింత అవతారాల్లో కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 7 ఈసారి మామూలుగా వుండదని గత ఎపిసోడ్లకు భిన్నంగా వుంటుందని నాగార్జున్న చెప్పారు.

MS Swaminathan : భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు.

Buggana Rajendranath Reddy:ఉద్యోగుల సంక్షేమానికి జగన్‌ ‘‘గ్యారెంటీ’’.. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఉద్యోగుల పక్షపాతినని నిరూపించుకున్నారు.

Balapur Laddu 2023 Price : అత్యధిక ధరకు బాలాపూర్ గణపతి లడ్డూ .. ఈసారి రికార్డు బద్ధలు

11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు.