ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పాజిటివ్ విషయమై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా వివాదంపై ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్లో కచ్చితత్వం 67 శాతమేనని పేర్కొంది. వ్యక్తి శరీరంలో 100 శాతం వైరస్ ఉంటేనే పాజిటివ్‌గా ఫలితం వస్తుందని స్పష్టం చేసింది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ స్థాయిని బట్టి కూడా ఫలితం మారుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలిసారి దీపక్‌రెడ్డి ఏపీలో చేయించుకున్నప్పుడు ఆయన శరీరంలో నూరుశాతం వైరల్ ఇన్ఫెక్షన్ ఉండి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. రెండోసారి ఆయన ఆరోగ్యం కాస్త మెరుగైనందున నెగిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా.. దీపక్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తే.. పాజిటివ్ రాగా.. ఆయన తెలంగాణలో చేయించుకుంటే నెగిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇది కాస్తా ఏపీలో వివాదానికి దారి తీసింది. పాజిటివ్ పేరుతో దీపక్‌రెడ్డిని క్వారంటైన్ చేయాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని టీడీపీ ఆరోపించింది. రోజుకు వేలల్లో టెస్టులు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరిపోదని.. ఫలితాల్లో కచ్చితత్వం ఉండాలని తెలిపింది. నెగిటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout