ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పాజిటివ్ విషయమై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ

  • IndiaGlitz, [Friday,June 26 2020]

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా వివాదంపై ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో కచ్చితత్వం 67 శాతమేనని పేర్కొంది. వ్యక్తి శరీరంలో 100 శాతం వైరస్ ఉంటేనే పాజిటివ్‌గా ఫలితం వస్తుందని స్పష్టం చేసింది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ స్థాయిని బట్టి కూడా ఫలితం మారుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలిసారి దీపక్‌రెడ్డి ఏపీలో చేయించుకున్నప్పుడు ఆయన శరీరంలో నూరుశాతం వైరల్‌ ఇన్ఫెక్షన్‌ ఉండి పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. రెండోసారి ఆయన ఆరోగ్యం కాస్త మెరుగైనందున నెగిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా.. దీపక్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తే.. పాజిటివ్ రాగా.. ఆయన తెలంగాణలో చేయించుకుంటే నెగిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇది కాస్తా ఏపీలో వివాదానికి దారి తీసింది. పాజిటివ్ పేరుతో దీపక్‌రెడ్డిని క్వారంటైన్ చేయాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని టీడీపీ ఆరోపించింది. రోజుకు వేలల్లో టెస్టులు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరిపోదని.. ఫలితాల్లో కచ్చితత్వం ఉండాలని తెలిపింది. నెగిటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు.

More News

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ నడిపేందుకు యత్నించి కింద పడిపోయిన ‘జెర్సీ’ హీరోయిన్

‘జెర్సీ’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఈ అమ్మడు 2017లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఇన్‌స్టాగ్రాం వేదికగా అభిమానులతో పంచుకుంది.

లోక్‌సభ స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలవనున్న రఘురామ కృష్ణంరాజు

ఏపీలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ నేతలపైనే కయ్యానికి కాలు దువ్వారు.

తెలంగాణలో 11 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు 11 వేలు దాటాయి.

అందుకే కరోనా పరీక్షలు నిలిపివేశాం: ఆరోగ్యశాఖ డైరెక్టర్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని భావించామని..

అజిత్ భారీ కరోనా సాయం..

కరోనా విపత్తును ఎదుర్కొంటున్న ఏ ఒక్కరినీ కూడా వదలకుండా హీరో అజిత్ కుమార్ సాయమందించడంపై సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తమవుతోంది.