AP GST:జీఎస్టీ వసూళ్లలో దుమ్మురేపిన ఏపీ.. సౌత్‌లోనే నంబర్ 1 స్టేట్‌గా రికార్డ్..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

ఏపీలో జీఎస్టీ వసూళ్లు దుమ్మురేపాయి. రాష్ట్రంలో అభివృద్ధి ప్రగతి పథంలో దూసుకుపోతుంది అనడానికి జీఎస్టీ వసూళ్లే ప్రత్యక్ష ఉదహరణగా నిలుస్తున్నాయి. పాలకుడు బాధ్యతగా ఉంటే రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా కూడా ఎలా ముందుకెళ్తుందో తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక విధానాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సులభతరం వాణిజ్య విధానాలు అమలు చేయడంలోనూ, దేశీయ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ గొప్ప ప్రగతి సాధించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదికల్లో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన 2023, అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ తొలిస్థానంలో నిలిచింది.

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం 12% వృద్ధిరేటుతో రూ. 18,488 కోట్లుగా ఉంది. ఇక మరో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక కూడా 2% వృద్ధిరేటుతో ఆంధ్రతో సమానంగా ఉంంది. ఇక మిగిలిన రాష్ట్రాలైన తెలంగాణ 10%, తమిళనాడు 9%, కేరళ 5% వృద్ధిరేటును నమోదు చేసి తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇక దేశ వ్యాప్తంగా అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,72,003 కోట్లుగా ఉంది. మొత్తంలో రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ, రూ.91,315 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 42,127 కోట్లతో కలిపి), ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు(రూ. 1,294 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయి.

మొత్తానికి చూసుకుంటే సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నుల ఆదాయంలో దూసుకుపోతోంది. ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు.