లోకేశ్‌కు షాకిచ్చిన జగన్ సర్కార్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు జగన్ సర్కారు షాకిచ్చింది. ఇప్పటి వరకూ లోకేశ్‌కు ఉన్న ‘వై’ కేటగిరీ భద్రతను తగ్గించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ‘వై’ భద్రతను కాస్త ‘ఎక్స్’కు తగ్గించింది. కాగా.. లోకేశ్ భద్రత తగ్గించడం గత 8 నెలల్లో ఇది రెండోసారి. టీడీపీ హయాంలో లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత ఉండగా దాన్ని ‘వై’కు తగ్గించగా.. తాజాగా దాన్ని ‘ఎక్స్’ చేసింది. కాగా.. ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్న మూడు రాజధానుల వ్యవహారంపై అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా ఆందోళనలు చేయడంతోపాటు.. శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా లోకేశ్ వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ భావిస్తోంది.
ఇందుకేనా కుదింపు!
మరోవైపు.. సాక్షి పత్రికపై లోకేశ్ ఇటీవలే రూ.75 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం.. పరువునష్టం దావా వేయడం... మరోవైపు మూడు రాజధానుల వ్యతిరేకంగా హడావుడి చేస్తుండటంతో ఆయన జోష్‌కు బ్రేక్‌లు వేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. 2016లో ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన ఘటన విదితమే. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని.. లోకేశ్ లక్ష్యంగా దాడులు చేస్తామని మావోయిస్టులు అప్పట్లో సంచలన ప్రకటన చేశారు. దీంతో అప్పట్లో లోకేశ్‌కు ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments