సుప్రీంకోర్టుకెక్కిన ఏపీ ‘పంచాయతీ'
Send us your feedback to audioarticles@vaarta.com
అనుకున్నదంతా అయ్యింది.. ఏపీ ‘పంచాయతీ’ సుప్రీంకోర్టుకెక్కింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.
హైకోర్టు ఏం చెప్పిందంటే..
కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.
కోడ్ అమల్లోకి వచ్చిందంటున్న ఎస్‌ఈసీ..
హైకోర్టు తాజా తీర్పుపై జగన్ సర్కార్.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారనేది ముందుగా ఊహించిన విషయమే. అయితే అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది..? ఇక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఉంటుందా..? లేకుంటే మరోలా ఉంటుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నికల కమిషన్ మాత్రం ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అంతేకాదు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని ఎస్ఈసీ అంటోంది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments