AP Govt:ఏపీలో ఇవాళ్టీ నుంచి అందుబాటులోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం .. 20 నిమిషాల్లోనే పూర్తి, ఏంటీ కార్డ్ 2.0

  • IndiaGlitz, [Friday,September 01 2023]

తన హయాంలో ఎన్నో పాలనా సంస్కరణలను తెచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వార్డు, గ్రామ వాలంటీర్ల విధానంతో పాలనను ఇంటింటికి చేరువ చేశారు. తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టార సీఎం వైఎస్ జగన్. సెప్టెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు కానుంది. రిజిస్ట్రేషన్ శాఖలో వున్న కార్డ్ 1.0 స్థానంలో.. కార్డ్ 2.0ను తీసుకొస్తున్నారు జగన్. ఈ విధానంతో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ సులువుగా మారుతుంది.

ఏంటీ కార్డ్ 2.0:

కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌ సింపుల్‌గా (కార్డ్ 2.0)ను రూపకల్పన చేపట్టింది. దీని ద్వారా ఆన్‌లైన్‌‌లోనే దస్తావేజులు తయారీ, స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల వద్ద ప్రజలు బారులు తీరే పరిస్ధితికి చెక్ పెట్టడంతో పాటు అక్రమాలు జరగకుండా చూడాలన్నది ప్రభుత్వ యోచన. దీని ద్వారా రిజిస్ట్రార్ ఆఫీసుకు రాకుండా వినియోగదారుడే సొంతంగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 20 నిమిషాల్లోనే దస్తావేజులు జారీ కానున్నాయి. ఈ నెల 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

అయితే ఈ విధానంలో చిక్కులూ లేకపోలేదు.. ఆరంభంలో అంతా సర్దుకోవడానికి టైం పడుతుందని చెబుతున్నారు. అలాగే కొత్త విధానంపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాల్సి వుంటుంది. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ వల్ల వ్యక్తిగత సమాచారం చోరీ అవుతుందని.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు ప్రతి ఒక్కరూ చూసే ప్రమాదం వుంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వ్యక్తిగత సమాచారం చోరీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ విధానం తమ ఉపాధిని తీవ్రంగా దెబ్బతీస్తుందని స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, జిరాక్స్ షాపుల యజామానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వీరంతా పెన్ డౌన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

More News

Chandrababu Naidu:చంద్రబాబుపై ఐటీ 'ఐ' : అమరావతిలో నిర్మాణాలు, షెల్ కంపెనీలతో కోట్లు జేబులోకి.. రట్టు చేసిన సీబీఐ

దొంగ దొరికే వరకు దొరేనంటారు. అలాగే ఏ వ్యక్తి  చేసిన నేరానికైనా శిక్ష పడాలంటే పాపం పండాలంటారు.

Aditya L1:మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపు ఆదిత్య ఎల్ 1 లాంచింగ్, మొదలైన కౌంటింగ్

చంద్రయాన్ 3 ప్రయోగంతో మంచి ఊపు మీదుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా

CBI Court :జగన్ , విజయసాయిరెడ్డిలకు ఊరట.. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ గ్రీన్ సిగ్నల్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు కోర్టులో ఊరట లభించింది.

Tiger Nageswara Rao:టైగర్ నాగేశ్వరరావుకు షాక్.. రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్, కారణమిదే

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. 1970-80 దశకాల్లో స్టువర్ట్ పురం ప్రాంతంలో నివసించిన టైగర్ నాగేశ్వరరావు

ఎంతకు తెగించార్రా.. ఏకంగా సుప్రీంకోర్ట్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్, సీజేఐ జాగ్రత్తలు

కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులు , ప్రముఖులు, వ్యక్తులు, బ్రాండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.