AP Govt:ఏపీలో ఇవాళ్టీ నుంచి అందుబాటులోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం .. 20 నిమిషాల్లోనే పూర్తి, ఏంటీ కార్డ్ 2.0
Send us your feedback to audioarticles@vaarta.com
తన హయాంలో ఎన్నో పాలనా సంస్కరణలను తెచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వార్డు, గ్రామ వాలంటీర్ల విధానంతో పాలనను ఇంటింటికి చేరువ చేశారు. తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టార సీఎం వైఎస్ జగన్. సెప్టెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు కానుంది. రిజిస్ట్రేషన్ శాఖలో వున్న కార్డ్ 1.0 స్థానంలో.. కార్డ్ 2.0ను తీసుకొస్తున్నారు జగన్. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులువుగా మారుతుంది.
ఏంటీ కార్డ్ 2.0:
కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ సింపుల్గా (కార్డ్ 2.0)ను రూపకల్పన చేపట్టింది. దీని ద్వారా ఆన్లైన్లోనే దస్తావేజులు తయారీ, స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద ప్రజలు బారులు తీరే పరిస్ధితికి చెక్ పెట్టడంతో పాటు అక్రమాలు జరగకుండా చూడాలన్నది ప్రభుత్వ యోచన. దీని ద్వారా రిజిస్ట్రార్ ఆఫీసుకు రాకుండా వినియోగదారుడే సొంతంగా ఆన్లైన్లో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 20 నిమిషాల్లోనే దస్తావేజులు జారీ కానున్నాయి. ఈ నెల 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.
అయితే ఈ విధానంలో చిక్కులూ లేకపోలేదు.. ఆరంభంలో అంతా సర్దుకోవడానికి టైం పడుతుందని చెబుతున్నారు. అలాగే కొత్త విధానంపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాల్సి వుంటుంది. అంతేకాదు.. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ వల్ల వ్యక్తిగత సమాచారం చోరీ అవుతుందని.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు ప్రతి ఒక్కరూ చూసే ప్రమాదం వుంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వ్యక్తిగత సమాచారం చోరీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ విధానం తమ ఉపాధిని తీవ్రంగా దెబ్బతీస్తుందని స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, జిరాక్స్ షాపుల యజామానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వీరంతా పెన్ డౌన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout