వారికి గుడ్‌న్యూస్.. రూ.10 వేలున్న జీతాన్ని 28 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

ప్రపంచంలో వాళ్లకో ప్రత్యేక స్థానముంది. పలు సందరభాల్లో వారు చూపిన చొరవకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇక చెప్పనవసరం లేదు. కరోనా సమయంలో వారి సేవలు చాలా కీలకం. వారెవరో కాదు.. అంబులెన్స్ డ్రైవర్లు..

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రజానీకానికి సేవలందించేందుకు 10వేల 800.. 108, 104 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటిని సీఎం జగన్ నేడు ప్రారంభించిన కొద్దిసేపటికే ఆ వాహన సిబ్బందికి గుడ్ న్యూస్ అందించారు. ఈ వాహనాల డ్రైవర్లకు భారీగా జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

104, 108 వాహనాల్లో పని చేస్తున్న డ్రైవర్లకు గతంలో కేవలం 10 వేలున్న జీతాన్ని కనిష్టంగా రూ.18000 నుంచి గరిష్టంగా రూ.28 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే అంబులెన్స్‌ల్లో పని చేస్తున్న టెక్నీషియన్లకు రూ.30 వేల వరకూ జీతాన్ని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 104, 108 సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.