'కరోనా'పై మీడియాకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు.. వార్నింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా రద్దీగల ప్రాంతాల్లో, గుంపులుగా ఉండొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే.. కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమ వార్తపత్రికలు.. చానెల్స్.. వెబ్సైట్లనే చూడాలని పెద్ద ఎత్తున పుకార్లు రాసేస్తున్నాయి. ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రకటనలు రాకుండానే వాటిని ప్రచురించేస్తున్నాయి. ఇంకొదరైతే దీన్నే అదనుగా చేసుకుని సదరు చానెల్.. వెబ్‌సైట్స్ వార్తలు రాసినట్లు మార్ఫింగ్‌లు చేసేసి నానా హడావుడి చేసేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. వార్తా కథనాలపై పత్రికలు, టీవీ చానళ్ల అధిపతులు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, రిపోర్టర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఈ ప్రకటనలో పలు సలహాలు, సూచనలు చేయడం జరిగింది. ఒకవేళ ఈ మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని జవహర్ రెడ్డి తేల్చిచెప్పారు. కరోనా వైరస్ నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రసార మాధ్యమాల సహకారాన్ని ఆయన కోరారు.
మార్గదర్శకాలు ఇవే..
- రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్ విడుదల చేస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణనలోకి తీసుకోవాలి.
- కరోనా వైరస్ కేసులు, వైరస్ వల్ల మరణాల విషయంలో అధికారిక సమాచారం లేకుండా ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.
- అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించరాదు.. ప్రసారం చేయరాదు. కరోనా వైరస్ సోకి పాజిటివ్‌గా వచ్చిన కేసుల విషయంలో బాధితుల పేర్లు, చిరునామాలు ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.
- వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయరాదు, ప్రచురించరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వెబ్సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెబ్సైట్లను పరిశీలించడం ద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని పొందవచ్చు.
- మూఢ నమ్మకాలను వ్యాప్తి చేసేలా సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com