ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇస్తున్న మందులను ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. మధ్యాహ్నంలోగా ఆనందయ్య మందుపై ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసి కేసు విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. అయితే కంట్లో వేసే డ్రాప్స్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది.
కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉండటంతో దానికి మాత్రం అనుమతిని ఇవ్వలేదు. కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనిని కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అలాగే ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్... మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: ఆనందయ్య మందుతో కోలుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ మృతి
ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి. కానీ.. ఆనందయ్య మందు వాడితే కొవిడ్ తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి.
కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది. ఈ నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఆనందయ్య మందుతో పాటు మిగిలిన మందులు సైతం వాడాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చునని తెలిపింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు రావద్దని ప్రభుత్వం సూచించింది. వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కొవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మందు పంపిణీ సందర్భంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments