ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • IndiaGlitz, [Monday,May 31 2021]

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇస్తున్న మందులను ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. మధ్యాహ్నంలోగా ఆనందయ్య మందుపై ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసి కేసు విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. అయితే కంట్లో వేసే డ్రాప్స్‌‌కు మాత్రం అనుమతి నిరాకరించింది.

కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉండటంతో దానికి మాత్రం అనుమతిని ఇవ్వలేదు. కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనిని కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అలాగే ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: ఆనందయ్య మందుతో కోలుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ మృతి

ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి. కానీ.. ఆనందయ్య మందు వాడితే కొవిడ్‌ తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి.

కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది. ఈ నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఆనందయ్య మందుతో పాటు మిగిలిన మందులు సైతం వాడాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చునని తెలిపింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు రావద్దని ప్రభుత్వం సూచించింది. వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కొవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మందు పంపిణీ సందర్భంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

More News

ఏపీలో జూన్ 10 వరకూ కర్ఫ్యూ

రాష్ట్రంలో జూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ప్యూ వేళలను మాత్రం యధాతథంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

పవన్, అకీరా ఇద్దరూ కలసి.. ఫోటోస్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. వైద్యుల పర్యవేక్షణలో పవన్ కోలుకున్నారు. కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

నేటి నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ మెట్రో పరుగులు

లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి జూన్‌ 9 వరకు పొడిగించింది.

ప్రేయసి వెంటిలేటర్‌పై ఉండగానే తాళి కట్టాడు.. కానీ..

కరోనా మహమ్మారి తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత దారుణంగా ఉంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కనీసం కుటుంబ సభ్యులంతా కలిసి కరోనా మృతులకు గౌరవప్రదంగా

ఆనందయ్యను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు?

ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టు ప్రశ్నించింది.