Yuvagalam : నారా లోకేష్ పాదయాత్రకు జగన్ సర్కార్ అనుమతి.. కండీషన్స్ అప్లయ్

  • IndiaGlitz, [Tuesday,January 24 2023]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్నిరోజులుగా వివిధ నిబంధనల పేరుతో పాదయాత్రకు సంబంధించి సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు పలుమార్లు డీజీపీకి లేఖ రాశారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకు సోమవారం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నిబంధనలకు లోబడి లోకేష్ పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొన్నారు.

400 రోజులు.. 4000 వేల కిలోమీటర్లు పాదయాత్ర:

ఇదిలావుండగా తెలుగుదేశం పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న నారా లోకేష్ ‘‘యువగళం’’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు తెరదీసిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయనున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే వుండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. రాష్ట్రంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలే ప్రధాన అంశాలుగా ఆయన గళమెత్తనున్నారు. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళికను రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు.

అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయాల్సిందేనా:

కాగా.. పాదయాత్ర చేస్తే అధికారం గ్యారెంటీ అనే సెంటిమెంట్ ప్రజల్లో , రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ఎన్నికల ముందే చాలా మంది నేతలు పాదయాత్రలు ప్లాన్ చేసుకుంటూ వుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 60 ఏళ్ల వయసులో పాదయాత్ర చేసి సీఎం పదవిని అందుకున్నారు. ఇక తండ్రి బాటలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
 

More News

Udaya Bhanu : గాజు గ్లాస్‌లో టీ తాగుతూ.. పవర్‌స్టార్ పంచ్ డైలాగ్, వైరలవుతోన్న ఉదయభాను పోస్ట్

ఉదయభాను.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఇప్పుడంటే కొత్తవారు వచ్చేశారు గానీ ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై ఉదయభాను రాణిగా వెలుగొందారు. సుమ,

Waltair veerayya : వాల్తేర్ వీరయ్యకు రేటింగ్.. యూఎస్ కలెక్షన్స్‌తో పోల్చుతూ చిరు సెటైర్లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య విజయవంతంగా దూసుకెళ్తోంది.

ఖైదీ నెంబర్ 150 ఎన్టీఆర్‌తో నేను చేయాల్సింది.. అలా మెగా కాంపౌండ్‌కి : గోపీచంద్ మలినేని సంచలనం

సరిగ్గా ఏడున్నర సంవత్సరాల క్రితం రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత సినీ పరిశ్రమలో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Dallas:అమెరికాలో హైటెక్ వ్యభిచారం.. స్ట్రింగ్ ఆపరేషన్‌లో తీగ లాగిన డల్లాస్ పోలీసులు, నిందితుల్లో ప్రముఖ తెలుగు వ్యక్తి

అమెరికాలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న సెక్స్ రాకెట్‌ను అక్కడి పోలీసులు రట్టు చేశారు.

స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. డిప్యూటీ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

తెలంగాణ సీఎంవో కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.